భారత్ ‘ఎ’ హ్యాట్రిక్ | Sakshi
Sakshi News home page

భారత్ ‘ఎ’ హ్యాట్రిక్

Published Mon, Sep 5 2016 12:42 AM

భారత్ ‘ఎ’ హ్యాట్రిక్

నాలుగు జట్ల టోర్నీ టైటిల్ సొంతం
ఆసీస్‌పై వరుసగా మూడో ఫైనల్లో గెలుపు
రాణించిన మన్‌దీప్, చహల్ 


మ్యాకే (ఆస్ట్రేలియా): నాలుగు జట్లు పాల్గొన్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ తొలి మ్యాచ్‌లో 56 పరుగులకే ఆలౌట్ అరుు ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో ఘోర పరాజయం... ఆ తర్వాత కూడా అదే జట్టు చేతిలో మరో లీగ్ మ్యాచ్‌లోనూ ఓటమి... కానీ అసలు పోరులో మాత్రం భారత్ ‘ఎ’ సత్తా చాటింది. ఫైనల్లో ఆసీస్ ‘ఎ’ను చిత్తు చేసి క్వాడ్రాంగులర్ వన్డే టోర్నమెంట్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నేషనల్ పెర్ఫార్మెన్‌‌స టీమ్‌లు కూడా పాల్గొన్నారుు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 57 పరుగుల తేడాతో ఆసీస్ ‘ఎ’పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేయగా, అనంతరం ఆస్ట్రేలియా 44.5 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. ‘ఎ’ జట్లు తలపడిన వన్డే టోర్నీలో ఆసీస్‌పై భారత్ వరుసగా మూడో ఫైనల్లో విజయం సాధించడం విశేషం. గతంలో 2014, 2015లలో కూడా ఆసీస్‌పైనే టీమిండియా నెగ్గింది. టైటిల్ నెగ్గిన జట్టుకు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే అభినందనలు తెలిపారు.

 
పాండే అదే జోరు...

భారత్ రెండో ఓవర్లోనే కరుణ్ నాయర్ (1) వికెట్ కోల్పోరుుంది. అరుుతే రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మన్‌దీప్ సింగ్ (108 బంతుల్లో 95; 11 ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. రెండో వికెట్‌కు శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 41; 3 ఫోర్లు)తో 81 పరుగులు జోడించిన మన్‌దీప్, మూడో వికెట్‌కు కెప్టెన్ మనీశ్ పాండే (71 బంతుల్లో 61; 2 ఫోర్లు)తో 87 పరుగులు జత చేశాడు. అరుుతే దురదృష్టవశాత్తూ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో మన్‌దీప్ అవుట్ కాగా... ఆ తర్వాత  పాండే కూడా తన జోరు కొనసాగించాడు.  పాండే, కేదార్ జాదవ్ (25 నాటౌట్) నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఈ టోర్నీలో 7 ఇన్నింగ్‌‌సలలో కలిపి రెండు సెంచరీలు సహా 359 పరుగులు చేసిన మనీశ్ పాండే టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. నెమ్మదైన అవుట్ ఫీల్డ్ కారణంగా బౌండరీలు ఎక్కువగా రాకపోరుునా, ఆఖరి 15 ఓవర్లలో భారత్ 100 పరుగులు చేయగలగడం విశేషం.

 
చహల్‌కు 4 వికెట్లు...

ఆసీస్ ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్ (54 బంతుల్లో 34; 2 ఫోర్లు), ప్యాటర్సన్ (19) ఇన్నింగ్‌‌సను జాగ్రత్తగా ఆరంభించగా ఏడో ఓవర్లో ధావల్ చక్కటి బంతితో ప్యాటర్సన్‌ను అవుట్ చేసి ఈ  జోడీని విడదీశాడు. అనంతరం బాన్‌క్రాఫ్ట్, మాడిసన్ (54 బంతుల్లో 31; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దశలో పార్ట్‌టైం స్పిన్నర్ కరుణ్ నాయర్ తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ చేర్చాడు. అరుుతే కెప్టెన్ హ్యాండ్‌‌సకోంబ్ (59 బంతుల్లో 43; 1 ఫోర్, 1 సిక్స్), అలెక్స్ రాస్ (31 బంతుల్లో 34; 4 ఫోర్లు) పోరాడారు. వేగంగా ఆడిన ఈ జోడి నాలుగో వికెట్‌కు 69 బంతుల్లోనే 77 పరుగులు జత చేసింది. అరుుతే 15 పరుగుల తేడాతో ఇద్దరినీ వెనక్కి పంపి భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. అనంతరం తన లెగ్‌స్పిన్‌తో చెలరేగిన యజువేంద్ర చహల్ ఆసీస్ ఆఖరి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లలో నలుగురిని పెవిలియన్‌కు పంపించాడు. కంగారూలు 26 పరుగుల వ్యవధిలోనే తమ చివరి 6 వికెట్లు కోల్పోరుు ఓటమిపాలయ్యారు.

Advertisement
Advertisement