హామిల్టన్@ 50 | Sakshi
Sakshi News home page

హామిల్టన్@ 50

Published Mon, Oct 24 2016 11:45 PM

హామిల్టన్@ 50

యూఎస్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం



ఆస్టిన్ (అమెరికా): డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూరుుస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. యూఎస్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రేసులో నిర్ణీత 56 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 38 నిమిషాల 12.618 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొందాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఏడో విజయం కాగా... కెరీర్‌లో 50వ టైటిల్. ఈ గెలుపుతో ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన డ్రైవర్స్ జాబితాలో హామిల్టన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. షుమాకర్ (91),  ప్రాస్ట్ (51) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. తాజా విజయంతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ (305 పారుుంట్లు), నికో రోస్‌బర్గ్ (331 పారుుంట్లు) మధ్య తేడా 26 పారుుంట్లకు చేరుకుంది. ఈ సీజన్‌లో మరో మూడు రేసులు మిగిలి ఉన్నారుు. తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది.

 
‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యంలోనే కొనసాగాడు. తొలి పిట్‌స్టాప్ వద్ద వెనుకబడినా ఆ వెంటనే మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్‌బర్గ్‌లకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలిచి నాలుగు పారుుంట్లు పొందగా... నికో హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement