Sakshi News home page

వండర్ కిడ్ శివాని

Published Wed, Mar 25 2015 1:28 AM

వండర్ కిడ్ శివాని

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
 
విజయవాడ స్పోర్ట్స్: పిట్ట కొంచెం కూత ఘనం.. అంటే ఇదేనేమో.. ఆర్చరీలో ఘనమైన వారసత్వం కలిగి ఉన్న రెండు సంవత్సరాల 11 నెలల చిన్నారి డాలీ శివాని మంగళవారం అరుదైన ఘనత సాధించింది. విజయవాడకు చెందిన ప్రఖ్యాత ఆర్చర్, కోచ్ దివంగత చెరుకూరి లెనిన్ సోదరైన డాలీ తన ప్రావీణ్యంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. గురి తప్పకుండా 5మీ., 7మీ., దూరంలో బాణాలు విసిరి 388 పాయింట్లను సాధించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డులకెక్కింది.

ఇండియా బుక్ ప్రతినిధుల సమక్షంలో డాలీ శివానీకి 7 మీటర్ల దూరంలో టార్గెట్ ఫేస్ (122 సెం., ఎత్తు 166 సెం., 90 డిగ్రీలు), అలాగే 5 మీటర్ల దూరంలో టార్గెట్ ఫేస్ (80 సెం. ఎత్తు మీటర్లు, 166 సెం.)లో లక్ష్యాలను ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగానికి 36 బాణాల చొప్పున 72 బాణాలు ఇచ్చారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకునేందుకు 200 పాయింట్లు వస్తే సరిపోతుంది. అయితే 7 మీటర్ల టార్గెట్‌లో 199, 5 మీటర్ల డిస్టెన్స్‌లో 189 పాయింట్లతో మొత్తం 388 పాయింట్లను కైవసం చేసుకుని ఔరా అనిపించుకుంది. శివానికి బంగారు పతకంతో పాటు సర్టిఫికెట్ అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement