బంగ్లా పేసర్ అల్ అమీన్ ఇంటికి... | Sakshi
Sakshi News home page

బంగ్లా పేసర్ అల్ అమీన్ ఇంటికి...

Published Mon, Feb 23 2015 1:16 AM

బంగ్లా పేసర్ అల్ అమీన్ ఇంటికి...

సిడ్నీ: జట్టు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ పేసర్ అల్ అమీన్ హొస్సేన్‌ను స్వదేశానికి పంపాలని టీమ్ మేనేజిమెంట్ నిర్ణయించింది. రాత్రి 10 గంటల్లోపు జట్టు ఆటగాళ్లు తమ హోటల్‌కి రావాలనే నియమాన్ని ఈనెల 19న అల్ అమీన్ ఉల్లంఘించాడని టీమ్ మేనేజర్ ఖాలిద్ మహ్మూద్ తెలిపారు.
 
 ఒకవేళ అంతకు మించి సమయం బయట ఉండాల్సి వస్తే టీమ్ మేనేజిమెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వీలైనంత త్వరగా అతడ్ని బంగ్లాదేశ్‌కు పంపిస్తామని అన్నారు. 25 ఏళ్ల అమీన్ ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
 

Advertisement
Advertisement