‘నీ మెరుపులు.. వరల్డ్‌కప్‌లోనూ చూడాలి’ | Sakshi
Sakshi News home page

‘నీ మెరుపులు.. వరల్డ్‌కప్‌లోనూ చూడాలి’

Published Fri, May 3 2019 5:54 PM

You will do special things in World Cup, Yuvraj to Hardik    - Sakshi

ముంబై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌కు చేరడంలో ఆ జట్టు ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌ కష్టాల్లో పడ్డ సమయంలో తానున్నాంటూ బ్యాట్‌తో చెలరేగిపోతున్నాడు హార్దిక్‌. అయితే ఇదే ప్రదర్శనను వరల్డ్‌కప్‌లోనూ కొనసాగించాలని హార్దిక్‌కు సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సూచించాడు. ఈ విషయాన్ని హార్దిక్‌కు తెలిపినట్లు యువీ పేర్కొన్నాడు.

‘నీ ముందు గొప్ప అవకాశం ఉంది. అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండు. నీ మెరుపులు.. వరల్డ్‌కప్‌లోనూ చూడాలి. ప్రస్తుతం ఎంత ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నావో అదే ఊపును మెగా టోర్నీలో కూడా కొనసాగించు’ అని హార్దిక్‌కు తెలిపినట్లు యువీ స్పష్టం చేశాడు. ఒత్తిడి సమయంలో బౌలింగ్‌ ఎలా చేయాలో అనే విషయాన్ని హార్దిక్‌ బాగా వంట బట్టించుకున్నాడని,  ఇదే అతనికి వరల్డ్‌కప్‌లో బాగా కలిసి వస్తుందన్నాడు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో యువరాజ్‌ సింగ్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. దాంతో హార్దిక్‌తో కలిసి తన వరల్డ్‌కప్‌ అనుభవాన్ని యువీ పంచుకుంటున్నాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ను భారత జట్టు సాధించడంలో యువరాజ్‌ ప్రధాన భూమిక పోషించాడు.

Advertisement
Advertisement