ఆశిష్‌ నెహ్రా డ్యాన్స్‌ కావాలి: యువీ

10 Jul, 2020 09:34 IST|Sakshi

అస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్‌ వార్నర్‌ తరచూ తన సహ ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఆటపట్టిస్తుంటాడు. ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు‌ వార్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులోని ఆటగాళ్లైన శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌, ఇండియన్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌లు డ్యాన్స్‌ వీడియోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఈ డ్యాన్సర్స్‌కు పేరు పెట్టండి’ అనే క్యాప్షన్‌ జత చేశాడు. (చదవండి: 20 ప్రపంచకప్‌ వాయిదా పడితే.. ఐపీఎల్‌లో పాల్గొంటా)

Name these two dancers???? #throwback @sunrisershyd

A post shared by David Warner (@davidwarner31) on

అది చూసిన ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ‘నాకు నాకు భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా డ్యాన్స్‌ కావాలి’ అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. కరోనా లాక్‌డౌన్‌లో వార్నర్‌ తన ​కుటుంబంతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులకు వినోదం అందించారు. లాక్‌డౌన్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఓడీఎల్(వన్‌ డే ఇంటర్‌నేషనల్‌)‌ ఆడిన ఆస్ట్రేలియా.. డిసెంబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్న 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌తో తలపడనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా