యువరాజ్@300! | Sakshi
Sakshi News home page

యువరాజ్@300!

Published Tue, Jun 13 2017 3:42 PM

యువరాజ్@300!

బర్మింగ్హోమ్:భారత వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకోబోతున్నాడు. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300 వన్డేల మార్కును చేరేందుకు యువీకి కేవలం అడుగుదూరంలో నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో గురువారం బంగ్లాదేశ్ జరుగనున్న వన్డే మ్యాచ్ ద్వారా ఆ ఘనతను సాధించబోతున్నాడు. భారత తరపున కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే మూడొందల వన్డేలను ఆడగా, వారి సరసన యువీ చేరనున్నాడు. అంతకుముందు భారత మాజీ క్రికెటర్లు మొహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లు మాత్రమే మూడొందల మార్కును చేరిన వారిలో ఉన్నారు.

2000వ సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన యువీ.. 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో తనదైన మార్కును చూపెడుతూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2007లో భారత జట్టు మినీ వరల్డ్ కప్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువీ.. 2011 వన్డే వరల్డ్ కప్ లో్ కూడా సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు. మరొకవైపు 2002లో ఇంగ్లండ్ తో జరిగిన నాట్వెస్ట్ ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో యువీ ముఖ్య భూమిక పోషించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్కు ఎన్నో మధురమైన విజయాల్ని అందించిన ఘనత యువీది.  మరో రెండు రోజుల్లో మూడొందల వన్డే ఆడబోతున్న యువీ ఆ మ్యాచ్ ను మరుపురాని జ్ఞాపకంగా ఉంచుకుంటాడని ఆశిద్దాం.

Advertisement
Advertisement