అదే యువీ ప్రత్యేకత: సచిన్‌ | Sakshi
Sakshi News home page

అదే యువీ ప్రత్యేకత: సచిన్‌

Published Sat, Jun 17 2017 12:01 AM

అదే యువీ ప్రత్యేకత: సచిన్‌

ముంబై: భారత బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ 300 మ్యాచ్‌ సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘యువీ ఈ 300 మ్యాచ్‌లు ఆడే క్రమంలో ఎన్నో అడ్డంకులను, సవాళ్లను పట్టుదలతో అధిగమించాడు. యువీ ఎదుర్కొన్న పరిస్థితులు తలుచుకుంటే నా మనసు ద్రవిస్తుంది’ అని సచిన్‌ అన్నారు.

జీవితంలో ప్రతీ సందర్భంలోనూ తన ప్రత్యేకత చాటుకుంటూ ఈ స్థితికి చేరుకున్నాడు. ఇకముందు కూడా అలాంటి తపనతోనే అతడు దేశానికి, భారత జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తాడన్న నమ్మకం ఉంది అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement