విమాన పైలెట్గా బాలుడు | Sakshi
Sakshi News home page

విమాన పైలెట్గా బాలుడు

Published Sat, Jul 11 2015 9:16 AM

విమాన పైలెట్గా బాలుడు

చెన్నై : కోయంబత్తూరు జేఎన్‌ఎం హాస్పిటల్‌లో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడు ముకిలేష్ కోరికను సులూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని స్క్వాడ్రన్ పైలెట్ లు తీర్చారు. అతి పిన్న వయస్సు గల ముకిలేష్‌ను గౌరవ పైలెట్‌గా ప్రశంసిస్తూ హెలికాప్టర్‌లో తిప్పి బాలుడి కలను నిజం చేశారు. శుక్రవారం బాలుడు తల్లిదండ్రులతో కలసి కోయంబత్తూరు కేన్సర్ ఫౌండేషన్ డెరైక్టర్ బాలాజితో పాటు పలువురు వలంటరీలతో కలసి స్క్వాడ్రన్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ ఎస్‌కే గుప్తాను కలిసి ముకిలేష్ గురించి వివరించడంతో స్వాగతించారు.
 
 ఆ బాలుడిలో ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా పైలెట్ లు విమానంలో ఎక్కించి చక్కెర్లు కొట్టించారు. దీంతో ఆ బాలుడిలో సంతోషం వెల్లివిరిసింది. త్వరలో తలసీమియా నుంచి కోలుకోవాలని పైలెట్ లు చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

Advertisement
Advertisement