రోడ్డు ప్రమాదంలో ఇద‍్దరు దుర‍్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద‍్దరు దుర‍్మరణం

Published Sat, May 6 2017 10:44 AM

2 died in road accident at srikakulam distirict

టెక్కలి: జాతీయ రహదారి కొత్తపేట సమీపంలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవరు, క్లీనరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒడిశాకు చెందిన వ్యాన్‌ మామిడికాయల లోడ్‌తో శ్రీకాకుళం నుంచి బరంపురం వైపు వెళ్తూ కొత్తపేట వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీ కొట‍్టడంతో ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన డ్రైవర్‌, క్లీనరు అక్కడికక్కడే మృతి చెందారు. కోటబొమ్మాళి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement