రూప 2.0: వేటు పడినా తగ్గని డీఐజీ | Sakshi
Sakshi News home page

రూప 2.0: వేటు పడినా తగ్గని డీఐజీ

Published Tue, Jul 18 2017 8:21 AM

రూప 2.0: వేటు పడినా తగ్గని డీఐజీ

బెంగళూరు: శశికళకు బెంగుళూరు జైలు అందుతున్న వీఐపీ ట్రీట్‌మెంట్‌ వివరాలను బయటపెట్టిన డీఐజీ రూపపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. అయినా వెనక్కు తగ్గని ఆమె శశికళకు జైలులో అందుతున్న లగ్జరీలకు సంబంధించి రెండో రిపోర్టును సోమవారం సమర్పించారు.

చట్ట విరుద్దంగా శశికళకు వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతోందని రిపోర్టులో ఆమె పేర్కొన్నారు. రిపోర్టులోని అంశాలు ఇలా .. శశికళ అవసరాల కోసం జైలులో ఐదు సెల్‌లకు తాళం వేయకుండా ఉంచారు. శశికళ నడవడానికి జైలులోని కారిడార్‌లో కొంతభాగం బారికేడ్‌లా నిర్మించారు. శశికళకు తెచ్చే ఆహారం ప్రత్యేక వాహనాల్లో వస్తుంది. ఆమెకు ప్రత్యేకంగా బెడ్‌తో పాటు సకల సదుపాయాలు జైలులో సమకూర్చారు.

రూప సమర్పించిన మొదటి రిపోర్టు కర్ణాటక జైళ్ల శాఖను ఓ కుదుపు కుదిపింది. జైళ్ల శాఖ డీజీపీ హెచ్‌ఎస్‌ఎన్‌ రావు ఆ రిపోర్టును నిరాకరించినా.. రూప మాత్రం పబ్లిక్‌గా రిపోర్టుపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య.. హైలెవల్‌ విచారణకు ఆదేశించారు. సోమవారం రూపపై బదిలీ వేటు కూడా పడింది.

ఆమెను ట్రాఫిక్‌ వింగ్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూప బదిలీపై మాట్లాడిని సీఎం.. ఆమెను బదిలీ చేయడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. ఆమెను ఎందుకు బదిలీ చేయకుడదంటూ మీడియాను ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని మీడియాతో చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement