కార్డన్ సెర్చ్.. భారీగా వాహనాలు పట్టివేత | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్.. భారీగా వాహనాలు పట్టివేత

Published Fri, Dec 23 2016 12:23 PM

80 bikes seized in carden search in jagtial district

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు శుక్రవారం ఉదయం పట్టణంలో కార్డన్‌సెర్చ్ చేపట్టారు. సుమారు170 మంది పోలీసులు పాల్గొని, ప్రతి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 80 బైకులు, 2 ట్రాలీ ఆటోలను, రెండు కార్లతో పాటు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులతో పాటు అరెస్టు వారెంట్ ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుకున్నారు. ఎస్పీ అనంత్‌శర్మ నేతృత్వంలో ఈ సోదాలు చేపట్టారు.

Advertisement
Advertisement