Sakshi News home page

తమిళం తప్పనిసరి

Published Sun, Feb 15 2015 2:36 AM

తమిళం తప్పనిసరి - Sakshi

సాక్షి, చెన్నై:రాజధాని నగరంలో కొన్ని చిన్నా పెద్ద దుకాణాల్లో, ప్రైవేటు సం స్థల కార్యాలాయల్లో తమిళంలో ఆయా దుకాణాల పేర్లు, వీధుల పేర్లు ఉన్నా యి. అయితే, మెజారిటీ శాతం దుకాణాలు, సంస్థలు, కార్యాలయల్లో తమిళంలో బోర్డులు ఎన్నా, ఆంగ్లం లోనే ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చెన్నై కార్పొరేషన్, ఇక, తమిళంలో బోర్డులు తప్పని సరిగా ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆయా సంస్థలు, పరిశ్రమల లెసైన్సుల రెన్యూవల్ పర్వం ఆరంభం కావడాన్ని పరిగణన లోకి తీసుకుని ఆయా సంస్థలకు హుకుం జారీ చేసింది. ఆంగ్లంతో పాటుగా వారికి తోచిన భాషల్లో బోర్డులు ఏర్పాటు చేసుకున్నా, తప్పని సరిగా తమిళం అక్షరాలు కన్పించాల్సిందేనని స్పష్టం చేసింది.
 
 ఈ మేరకు కార్పొరేషన్ అధికార వర్గాలు ప్రకటించాయి. అలాగే, లెసైన్సుల రెన్యూవల్, కొత్త లెసైన్సులకు దరఖాస్తుల గడువును మార్చి 31గా నిర్ణయించారు. ఈ  ఏడాది తమిళంలో బోర్డుల హెచ్చరికతో పాటుగా కొత్తగా మరికొన్ని ఆంక్షల్ని విధించే  పనిలో పడ్డారు. అతి పెద్ద మాల్స్, సంస్థల్లో వికలాంగుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉండాలని ఆదేశించారు. అలాగే, వర్షపు నీటిని కార్పొరేషన్ కాలువల్లోకి వదిలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లను సిద్ధం చేస్తున్న సంస్థలకు కొత్త రకం ఆంక్షను విధించారు.
 
 ఇక మీదట ఎవరైనా పలా ఫ్లక్సీ, కటౌట్, బ్యానర్‌లు రూపొందించాలని వస్తే, వారి చిరునామా, ఫోన్ నెంబర్లు అన్ని వివరాల్ని తప్పని సరిగా రికార్డు పుస్తకాల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. పుట్ పాత్‌లలో దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన లెసైన్సులు ఇవ్వబోమని, రెన్యూవల్ చేయబోమని స్పష్టం చేశారు. 2015-16కు గాను లెసైన్సుల జారీ, రెన్యూవల్ ప్రక్రియను మార్చి 31లోపు ముగించనున్నామని ప్రకటించారు. వివరాలకు కార్పొరేషన్ వెబ్ సైట్‌ను ఆశ్రయించ వచ్చని సూచించారు. అలాగే, కొత్త లెసైన్సులు, రెన్యూవల్ ప్రక్రియను నగరంలోని పదిహేను మండల కార్యాలయాల్లోనూ చేసుకోవచ్చని, ఆయా కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశామని ప్రకటించారు.
 

Advertisement
Advertisement