ప్రభుత్వ ఉద్యోగులుగా పౌర కార్మికులు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులుగా పౌర కార్మికులు

Published Thu, Feb 19 2015 1:24 AM

As government employees, civilian workers

నగరాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సొరకె
ప్రతి కార్మికుడికి నెలకు రూ. పది వేల జీతం
పది కార్పొరేషన్లను కలిపి ఒక కమిషనరేట్ ఏర్పాటు

 
బెంగళూరు : రాస్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న పౌర కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రతి నెల 10,500 జీతం ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరాృవద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సొరకె తెలిపారు. బుధవారం ఉదయం ఆయన కేపీసీసీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దశల వారీగా పౌరకార్మికుల కాంట్రాక్ట్‌ను రద్దు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై రాష్ర్ట ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. బెంగళూరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది పౌర కార్మికులు పనిచేస్తుండగా 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని తెలిపారు. రాష్ర్టంలోని పది కార్పొరేషన్లను కలిపి ఒక కమిషనరేట్‌గా ఏర్పాటు చేయడంతో పాటు ఓ ఐఎఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించనున్నట్లు చెప్పారు.

అలాగే చెత్త సేకరణ, డ్రెయినేజీల నిర్వహణ కోసం రాష్ర్ట స్థాయిలో ఓ కమిటీని నియమించడం జరుగుతుందన్నారు. అక్రమ - సక్రమకు సంబంధించి కోర్టు తీర్పు వివరాలు అందగానే అమలు చేయనున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించుకున్న వారిపై చర్యలు చేపడతామని అన్నారు.  నగరాల్లో తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు అరికట్టేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో మరింత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. దళిత వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్‌లో తప్పు లేదని, అయితే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సమర్థవంతంగా పాలిస్తున్నప్పుడు ఈ డిమాండ్‌కు అర్థం లేకుండా పోతుందని అన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement