'అత్తా - కోడళ్ల' జాతర | Sakshi
Sakshi News home page

'అత్తా - కోడళ్ల' జాతర

Published Fri, Dec 25 2015 11:12 AM

'అత్తా - కోడళ్ల' జాతర

బెంగళూరు : సాధారణంగా చాలా ఇళ్లలో అత్తా - కోడళ్లు ఒకరినొకరు తిట్టుకోవడం, గొడవ ఇంకా ముదిరితే ఒకరినొకరు కొట్టుకోవడం కూడా చూస్తూ ఉంటాం. అయితే అత్తా - కోడళ్లు కొట్టుకోవడానికే ఓ జాతర ఉంది. చిత్రదుర్గ ప్రాంతంలో ప్రతి ఏడాది ఇలాంటి జాతర జరుగుతుంది. ధనుర్మాస ప్రారంభ సమయంలో చిత్రదుర్గలోని హిరియారు తాలుకా చిక్కీరణ్ణన మాళిగె గ్రామంలో ఈ జాతర జరుగుతుంది.

అందులోభాగంగా ఈ ఏడాది గురువారం జరిగిన జాతర సందర్భంగా గ్రామంలోని వారు అహోబిల నరసింహస్వామి ఊరేగింపును నిర్వహించారు. అనంతరం గ్రామంలోని అత్తా,కోడళ్లు అంతా ఓ చోటకు చేరి వాదులాడుకున్నారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని, జీవితాంతం తలనొప్పి కూడా రాదని ఇక్కడి మహిళల నమ్మకం.

Advertisement
Advertisement