ఆటో డ్రైవర్లకు మరాఠీ రావాల్సిందే | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్లకు మరాఠీ రావాల్సిందే

Published Fri, Nov 18 2016 3:56 PM

ఆటో డ్రైవర్లకు మరాఠీ రావాల్సిందే

ముంబై: మహారాష్ట్రలో ఆటో డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరిగా రావల్సిందేనని శుక్రవారం ఇచ్చిన తీర్పులో హై కోర్టు అభిప్రాయపడింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో స్థానిక భాష రాకపోవడంవల్ల ప్రయాణికుల సూచనలు, వారు చెబుతున్నది డ్రైవర్‌కు అర్థం కాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో మరాఠీ భాష రావల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది.

ఆటో డ్రైవర్లకు మరాఠీ తప్పని రావల్సిందేనని ఆంక్షలు విధిస్తూ స్థానిక ఆర్టీవో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. మరాఠీ రాని డ్రైవర్లకు ఆటో పర్మిట్లు జారీచేయకూడదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. దీన్ని సవాలుచేస్తూ మీరా-భాయిందర్ రిపబ్లికన్ ఆటో డ్రైవర్, యజమానుల సంఘం హై కోర్టును ఆశ్రయించింది.

ఈ నోటిఫికేషన్ వల్ల అనేక మంది ఆటోలు నడపలేకపోతున్నారు. దీంతో వారు ఉపాధి కోల్పోయి పస్తులుండే పరిస్థితి వచ్చింది. మరాఠీ భాషను కచ్చితం చేయరాదని, ఈ నోటిఫికేషన్ చట్ట విరుద్దంగా ఉందని, దీన్ని వెంటనే రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన హై కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement