‘న్యూట్రినో’ ఉద్యమం | Sakshi
Sakshi News home page

‘న్యూట్రినో’ ఉద్యమం

Published Mon, Mar 2 2015 1:53 AM

Best Indian neutrino observatory Movement

 పశ్చిమ పర్వత శ్రేణుల్లోని తేని జిల్లా వేదికగా ఏర్పాటుకు తలబెట్టిన ఇండో బెస్ట్ న్యూట్రినో అబ్జర్వేటరీ కేంద్రానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం బయలుదేరనుంది. ఇందు కోసం ఓ ఇయక్కం(సమాఖ్య) ఏర్పాటుకు సామాజిక కార్యకర్త మేథా పాట్కర్, ఎండీఎంకే నేత వైగో నిర్ణయించారు. ప్రజా మద్దతును కూడ గట్టుకుని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
 
 సాక్షి, చెన్నై :  రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో అత్యంత ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం తేని అన్న విషయం అందరికీ తెలిసిందే. ముల్లై పెరియా ర్ డ్యాంకు కూత వేటు దూరంలో, ఆ నదీ పరివాహక ప్రదేశంలో ఈ తేని కొలువుదీరి ఉంది. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాం తంలోని బొడి కొండలను వేదికగా చేసుకుని ఇండో బెస్ట్ న్యూట్రినో అబ్జర్వేటరీ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం ఆ పరిసర వాసుల్లో ఆందోళన బయలు దేరింది. వాతావరణ పరిశోధనల్లో విప్లవాత్మక అడుగులు లక్ష్యంగా నిర్మించ బోతున్న ఈ కేంద్రం ద్వారా తమ జీవనాధారం దెబ్బ తినే ప్రమాదం ఉందని, ముల్లై పెరియార్ డ్యాం నీళ్లు తమకు దక్కకుండా చేస్తున్నారన్న ఆగ్రహంతో ఆ పరిసర వాసులు ఉన్నారు.
 
 భారీ ఉద్యమం : ఆ కేంద్రం  పరిసరాల్లోని 20కు పైగా గ్రామాల ప్రజల్లో ఇప్పటికే కంటి మీద కునుకు కరువైంది. ఎలాం టి ముప్పు వస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కొండల్ని, అడవుల్ని పిప్పిచేస్తుండడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన రెట్టిం పు అయింది. ఆ కేంద్రం తమకు వద్దంటూ వ్యతిరేకించే పనిలో పడ్డారు. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా తొలుత ఎండీఎంకే నేత వైగో తన గళాన్ని విప్పా రు. ఆ కేంద్రానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంతో పాటుగా, ప్రజల్ని ఏకం చేసే పనిలో పడ్డారు. తమిళనాడు - కేరళ సరిహద్దుల్లో ఈ కేంద్రం నిర్మితం అవుతున్న దృష్ట్యా, దీన్ని అడ్డుకుందామంటూ అటు కేరళ ప్రజల్ని, పార్టీలకు పిలుపు నిచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమన్ చాండీ, ప్రతి పక్ష నేత అచ్చుదానందన్‌ను కలుసుకుని మద్దతు కోరా రు.
 
  దేశంలోని పలు పార్టీల నాయకుల్ని కలుస్తూ మద్దతు సేకరిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు అన్నాహజారే, మేథాపాట్కర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేసి భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఆ ప్రాజెక్టు పరిసరాల్లోని 20 గ్రామాల ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ కేంద్రం రూపంలో ఎదురయ్యే ముప్పు, వ్యవసాయానికి ఎదురయ్యే ప్రమాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించారు. ఇయక్కం ఏర్పాటు: తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పార్టీలకు అతీతంగా ఓ ఇయక్కం( సమాఖ్య) ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇందు కోసం రంగంలోకి సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ దిగారు. ఆదివారం మదురైలో ఎండీఎంకే నేత వైగో, సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ మీడియాతో మాట్లాడారు.
 
 ఆ కేంద్రం రూపంలో ఎదురయ్యే ప్రమాదాన్ని వివరించారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు భారీ నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఈ సందర్భంగా వైగో గుర్తు చేశారు. తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని, ఆ కేంద్రాని కి వ్యతిరేకంగా న్యాయ స్థానంలో న్యాయం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ హెరిటేజ్ జాబితాలో తేని ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలని, అలాంటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని తాముఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఓ ఇయక్కం ఏర్పాటు చేయబోతున్నామని ఈసందర్భంగా మేథా పాట్కర్ ప్రకటించారు. దేశంలోని అంద రూ పార్టీలకు అతీతంగా ఈ ఇయక్కంలోకి రావా లని పిలుపు నిచ్చారు. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా తొలుత నిరసనలు చేపట్టబోతున్నామని, తదనంతరం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆందోళనను ఉధృతం చేయబోతున్నామన్నారు.
 

Advertisement
Advertisement