హిందూ మున్నని నాయకుడి హత్య! | Sakshi
Sakshi News home page

హిందూ మున్నని నాయకుడి హత్య!

Published Thu, Jun 19 2014 11:35 PM

హిందూ మున్నని నాయకుడి హత్య! - Sakshi

 సాక్షి, చెన్నై: బీజేపీ, హిందూ మున్నని నేతలను టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్న  తీవ్రవాదులను ఇటీవల పుత్తూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉగ్రవాదుల్లో ఒకడైన అబూబక్కర్ సిద్ధిక్ జాడ మాత్రం కానరాలేదు. అతడి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బుధ వారం రాత్రి హిందూ మున్నని నేత దారుణ హత్యకు గురి కావడం కలకలాన్ని సృష్టించింది. ఈ ఘటనతో బీజే పీ, శివ సేన, హిందూ మున్ననని, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు ఆందోళన కు దిగారుు.
 
 పథకం ప్రకారం హత్య :
 కన్యాకుమారి జిల్లా కరక్కొడుకు చెందిన సురేష్‌కుమార్(46) చెన్నై అంబత్తూరులో స్థిర పడ్డారు. అక్కడి మన్నార్ పేట మలైమత్తయ్యమ్మన్ ఆలయం వీధి లో నివాసం ఉంటున్న ఆయనకు భార్య భావన(40), పిల్లలు కృష్ణవేణి(10), కిరణ్మయి(8) ఉన్నారు.  సురేష్‌కుమార్  తిరువళ్లూరు ఉత్తర జిల్లా హిందూ మున్నని అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా రు. ఈయనకు అంబత్తూరు ఎస్టేట్ రోడ్డులో కార్యాలయం ఉంది. ప్రతి రోజు ఈ కార్యాలయంలో రాత్రి పది గంటలకు వరకు ఉండేవారు. యథా ప్రకారం బుధవారం రాత్రి పది గంట లకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
 
 ఆయన అలా బయటకు వచ్చారో లేదో, మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు, కత్తులతో నరికి పడేశాడు. సురేష్ కుమార్ కేకలు విన్న సమీపంలోని పోలీస్ బూత్‌లో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ దండగులు ఉడాయించా రు. రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్‌కుమార్‌ను అన్నానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ సురేష్‌కుమార్ మృతి చెందారు. ఈ సమాచారంతో బీజేపీ, హిందూ మున్నని, శివసేన, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాల రగిలింది. మృతదేహంతో రాస్తారోకకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఎట్టకేలకు వారిని బుజ్జగించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు.
 
 ఉద్రిక్తత:
 తమ నాయకుడు హత్యతో తిరువళ్లూరు ఉత్తర జిల్లా పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మన్నార్ పేట, అంబత్తూరు ఎస్టేట్, పాడి పరిసరాల్లో దుకాణాలన్నీ మూతబడ్డాయి. బంద్‌ను తలపించే రీతి లో వాతావరణం నెలకొంది. కీల్పాకం పరిసరాల్లో భారీ జన సమీకరణతో బీజేపీ, శివసేన, హిందూ మున్నని, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పూందమల్లి హైరోడ్డులో బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. పూందమల్లి హైరోడ్డు స్తంభించడంతో వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆందోళన కారులను బుజ్జగించి, మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అప్పగించారు. మృత దేహాన్ని అంబులెన్స్ లో మన్నార్ పేటకు తరలించే క్రమంలో నిరసనకారులు  వాహనాలపై త ప్రతా పం చూపించారు.
 
 బస్సులపై దాడులు :
 అంబులెన్స్ వెంట పెద్ద ఎత్తున ఊరేగింపునకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కదిలారు. మార్గం మధ్యలో బస్సులు, వాహనాలు అడ్డురావడంతో తమ ప్రతాపం చూపించారు. నగర రవాణా సంస్థకు చెందిన పది బస్సుల అద్దాలు పగిలాయి. కార్లు, మోటార్ సైకిళ్లపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గట్టి భద్రత నడుమ మన్నార్‌పేటకు సురేష్‌కుమార్ మృత దేహాన్ని తరలించారు. ఆయన అంత్యక్రియల ఊరేగింపులో తొలుత ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
 
 మూడు బృందాలు
 సురేష్‌కుమార్ హత్య ఘటన విచారణకు మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డెప్యూటీ కమిషనర్ షణ్ముగ వేల్, అసిస్టెంట్ కమిషనర్లు మైల్ వాహనన్, నందకుమార్ పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. పోలీ స్ బూత్‌కు, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ హత్య జరిగిందంటే, ముందుగా రె క్కీ నిర్వహించడంతోపాటుగా, సురేష్‌కుమార్ కదలికలను కొన్నాళ్లు పసిగట్టినట్టు స్పష్టం అవుతోంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరై ఉంటారన్న దిశగా విచారణ సాగుతోంది. అదే సమయంలో సురేష్‌కుమార్ కార్యాలయానికి పక్కనే  ఓ షాపులో సీసీ కెమెరా అమర్చి ఉండడంతో అందులోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు. తీవ్రవాదుల పనై ఉంటుందా? సురేష్‌కుమార్‌కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు వేగవంతం అయింది.
 

Advertisement
Advertisement