యువకుడి డేర్‌.. కాటేసిన పాముతో.. | Sakshi
Sakshi News home page

యువకుడి డేర్‌.. కాటేసిన పాముతో..

Published Tue, Jul 18 2017 5:13 PM

యువకుడి డేర్‌.. కాటేసిన పాముతో.. - Sakshi

చెన్నై: పాము కాటు వేయగానే లబోదిబో మొత్తుకోవడం సహజం. కొంతమందైతే తన ప్రాణం పోయిందిరా దేవుడా ఏడుస్తూ గుండె ఆగిపోయినంత పనిచేస్తారు. ఆ చుట్టుపక్కల ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉంటుంది. కానీ తమిళనాడులో ఓ యువకుడు మాత్రం చాలా ధైర్యంగా, సమయ స్ఫూర్తిగా వ్యవహరించాడు. తనను కాటేసిన వేసిన పామును చంపడమే కాకుండా దానిని తీసుకొని ఆస్పత్రి వెళ్లాడు. ఈ సంఘటన ఘటన చెన్నైలోని సేత్తుపట్టిలో చోటు చేసుకుంది. సెంథిల్‌కుమార్‌ (28) ఆదివారం రాత్రి తన ఇంటిలో నిద్రపోగా వేకువ జామున అతడిని ఓ విష సర్పం కాటేసింది.

అయితే, నొప్పి కారణంగా వెంటనే మేల్కొన్న యువకుడు పక్కనే కనిపించిన పామును వెంటనే కొట్టి చంపాడు. 108 ఆంబులెన్స్‌కి ఫోన్‌ చేశాడు. అంబులెన్స్‌ రాగానే తనతోపాటు సెంథిల్‌కుమార్‌ కాటు వేసిన పాము కళేబరంతో ఆస్పత్రికి వెళ్లాడు. అయితే, ఆ పాము కాటుకు మందులేదని చెప్పడంతో వెంటనే ఆరణి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు కరిచింది విషపూరితమైన పామేనని గుర్తించి, దానితో ప్రాణాపాయం ఉంటుందని చికిత్స ఆరంభించారు. సాధారణంగా కరిచిన పామును ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే వైద్యులకు వైద్యం చేయడం తేలికవుతుంది. కాటు ఆధారంగా చికిత్స చేయాలంటే అది ఏ రకమైన సర్పమో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి గుర్తించి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆలస్యం అయితే, ప్రాణాలుపోవొచ్చు కూడా. అయితే, తమిళనాడుకు చెందిన ఈ యువకుడు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించాడు.

Advertisement
Advertisement