8 ఏళ్ల తర్వాత బ్రిటీష్ ఎయిర్వేస్పై గెలిచాడు | Sakshi
Sakshi News home page

8 ఏళ్ల తర్వాత బ్రిటీష్ ఎయిర్వేస్పై గెలిచాడు

Published Fri, Nov 4 2016 6:42 PM

8 ఏళ్ల తర్వాత బ్రిటీష్ ఎయిర్వేస్పై గెలిచాడు - Sakshi

న్యూఢిల్లీ: సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా బ్యాగ్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి లక్ష రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ బ్రిటీష్ ఎయిర్వేస్ను ఆదేశించింది. ఎనిమిదేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది.

సిమ్లాకు చెందిన రమేష్ భార్గవ 2008లో ఢిల్లీ నుంచి బ్రిటీష్ ఎయిర్వేస్ విమానంలో లండన్కు వెళ్లాడు. అక్కడ హీత్రో విమనాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత రమేష్ తీసుకెళ్లిన రెండు బ్యాగుల్లో ఒకటి మాత్రమే అందింది. ఆయన ఈ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపినా ఫలితం లేకపోయింది. మూడు వారాల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే బ్రిటీష్ ఎయిర్వేస్ సిబ్బంది పరిహారం చెల్లించకపోవడంతో ఆయన కన్జూమర్ కోర్టును ఆశ్రయించాడు. బ్యాగ్ పోవడంతో తాను మానసికక్షోభ అనుభవించానని, న్యాయం చేయాల్సిందిగా కోర్టును కోరాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఎనిమిదేళ్ల తర్వాత తీర్పును వెలువరించింది. ఆలస్యం చేయకుండా వెంటనే పరిహారం చెల్లించాల్సిందిగా బ్రిటీష్ ఎయిర్వేస్ను ఆదేశించింది.
 

Advertisement
Advertisement