లెసైన్స్‌లేని వెయ్యి వాటర్ క్యాన్ కంపెనీలు | Sakshi
Sakshi News home page

లెసైన్స్‌లేని వెయ్యి వాటర్ క్యాన్ కంపెనీలు

Published Sat, Aug 17 2013 12:47 AM

Can not lesains thousand water companies

టీనగర్, న్యూస్‌లైన్: ప్రపంచంలో మూడింట ఒక శా తం మాత్రమే తాగునీరు ఉంది. మిగతా నీరు తాగడానికి వీలుకాని వ్యర్థజలం. ప్రస్తుతం తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోయి తీవ్ర ఎద్దడి నెలకొంది. అం తేకాకుండా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, పరిసరాల కాలుష్యం కా రణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ముఖ్యంగా ఈరోడ్, కరూ ర్ జిల్లాల్లో అద్దకపు పరిశ్రమల కారణం గా భూగర్భ జలాలు తీవ్ర కాలుష్యానికి లోనవుతున్నాయి. కలుషిత నీటిని తాగ డం ద్వారా అతిసార తదితర వ్యాధుల తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. 
 
 కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉత్తర చెన్నైలో ఈ సమస్య అధికంగా ఉండేది. అనేక ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పైపులైన్లలో పగుళ్లు ఏర్పడడంతో ప్రజలు సురక్షితమైన నీటి కోసం అన్వేషిస్తూ మినరల్ వాటర్‌ను ఆశ్రయించారు. 2000 ప్రాంతంలో నీటి ని ప్యాక్ చేసి పంపిణీ చేయడం అమలులోకి వచ్చింది. దీనికి ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభించడంతో క్యాన్ వాటర్ కంపెనీలు చెన్నై, పరిసర ప్రాం తాల్లో పుట్టగొడుగుల్లా వెలిశాయి. ము ఖ్యంగా పుళల్ జలాశయం పరిసరాల్లో ఈ కంపెనీల సంఖ్య అధికంగా ఉంది. క్యాన్ వాటర్ సప్లయి చేసేందుకు భార త నాణ్యతా ప్రమాణాల సంస్థ(ఐఎస్ ఐ), ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంస్థల నుంచి లై సెన్స్ పొందాల్సి ఉంటుంది. తాగునీటి అవసరాలు పెరగడంతో లెసైన్సులతో, లెసైన్సులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్ వాటర్ కంపెనీలు పనిచేయడం ప్రారంభించాయి.
 
 పస్తుతం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర జిల్లాల్లో 869 కంపెనీలు అనుమతి పొంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎటువంటి అనుమతి లేకుండా హెర్బ ల్, మినరల్ వాటర్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా కంపెనీలు పనిచేస్తున్నట్లు గణాంక వివరాలు తెలుపుతున్నాయి. ఇందులో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం వంటి జిల్లాల్లో 400 కంపెనీలు ఉన్నాయి. వీటిపై నియంత్రణ లేకపోవడంతో ఇవి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. క్యాన్ వాటర్ కంపెనీల్లో ఇసుక, కార్బన్, మైక్రో ఫిల్ట్రేషన్‌తో సహా ఏడు స్థాయిల్లో శుద్ధీకరణ పనులు జరుగుతాయి. దీని ద్వారా తాగునీటిలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్ వంటివి తొలగించబడి తాగడానికి అనువైన నీటిగా మార్చబడ తాయి. ఇటువంటి నీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎటువంటి హాని ఏర్పడదు. అయితే లెసైన్సు పొందని కంపెనీలు నామమాత్రంగా నీటి శుద్ధీకరణ చర్యలు పాటించడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
 
 కొన్ని కంపెనీలు క్యాన్లను కూడా సక్రమంగా శుభ్రం చేయడం లేదు. లెసైన్స్ పొందని కంపెనీలు తమకు సొంతంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని, దాని నెట్‌వర్క్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్నాయి. ఇందులో చేరేందుకు సభ్య త్వ ఫీజుగా రూ.75 వేల వరకు వసూలు చేస్తున్నారు. అదే ఈ కంపెనీలకు లెసైన్స్‌గా పరిగణించబడుతోంది. ఈ కంపెనీలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో లెసైన్స్ పొందకుం డా పనిచేసే కంపెనీల సంఖ్య అధికమవుతోంది. ఇటువంటి కంపెనీల ఉత్పత్తులను నిలిపివేసేందుకు చెన్నైలోని దక్షిణ డివిజన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవ ల ఉత్తర్వులిచ్చింది. దీని తర్వాత కూడా ఈ కంపెనీలు నిరాటంకంగా పనిచేస్తున్నాయి. సంబంధిత అధికారులు రాష్ట్రవ్యాప్తంగా క్యాన్ వాటర్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 
 నకిలీలు పెరగడానికి కారణం:
 ఇండియన్ స్టాండర్డ్ ఇండస్ట్రీ(ఐఎస్‌ఐ) లెసైన్స్ పొందేందుకు క్యాన్ వాటర్ కం పెనీల్లో ఏడాదికి మూడు సార్లు అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అంతేగాకుండా మార్కెట్‌లో శ్యాంపిల్స్‌ను తీ సి పరీక్షిస్తుంటారు. ఇందులో లోపాలను కనుగొన్నప్పుడు సంబంధిత కంపెనీల కు సీలు వేస్తుంటారు. ఈ విధంగా మూ సివేతకు గురైన కంపెనీలు హెర్బల్, ఫ్లే వర్ పేర్లతో తాగునీటిని సర ఫరా చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
 
 81 పరీక్షలు:
 తాగునీటిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం క్లోరైడ్, ఫ్లోరైడ్, పాటాషియం సల్ఫేట్ వంటి ధాతువులు ఉంటాయి. వీటిని శుభ్రం చేయడానికి 81 పరీక్షలు చేస్తారు. ఇందులో 27 వాటర్ క్యాన్ కం పెనీల్లోని ల్యాబొరేటరీల్లో, మిగతా 54 పరీక్షలు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో చేస్తున్నారు. ఇవేగాకుండా రెండేళ్లకు ఒకసారి ఆల్ఫా, బీటా వంటి రే డియేషన్ పరీక్షలు చేయబడుతున్నాయి. ప్రజలు తాగాల్సి న నీటిలో 500 డీడీఎస్(ఉప్పు స్థాయి) ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెయ్యి డీడీఎస్ వరకు ఉండొచ్చని తెలియజేసిం ది. ఇవేగాకుండా నీటిలో ఆమ్లం, క్షార పరీక్షలు కూడా జరుగుతున్నాయి.

Advertisement
Advertisement