టన్ను ఎర్రచందనం పట్టివేత | Sakshi
Sakshi News home page

టన్ను ఎర్రచందనం పట్టివేత

Published Wed, Jul 6 2016 2:24 AM

టన్ను ఎర్రచందనం పట్టివేత - Sakshi

గుమ్మిడిపూండి: అక్రమంగా ఇంట్లో దాచిన టన్ను ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన గుమ్మిడిపూండిలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల మేరకు గుమ్మిడిపూండి సమీపంలోని కరిమేడు గ్రామంలో ఒక ఇంట్లో ఎర్రచంద నం దుంగలు ఉన్నట్టు కవరపేట పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో కవరపేట ఎస్.ఐ. మహాలింగం నేతృత్వంలో పోలీసులు కరిమేడు గ్రామంలోని ఆటోడ్రైవర్ రమేష్ అనే అతని ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేయడంతో ఇంటి వెనుక భాగంలోని షెడ్‌లో మూడు నుంచి నాలుగు అడుగుల 32 ఎర్రచందనం దుంగలు దాచి ఉన్నట్టు గుర్తించారు.

దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని గుమ్మిడిపూండి అటవిశాఖ కార్యాలయానికి తరలించారు. ఇందుకు కారణమైన రమేష్, ఆయన భార్య రుక్మిణిలను పోలీసులు అరెస్టు చేశారు. వీటి విలువ దాదాపు రూ. 40లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కవరపేట పోలీసులు కేసు దర్యాప్తు  చేస్తున్నారు.

Advertisement
Advertisement