బాసరలో నగదు రహిత లావాదేవీలు | Sakshi
Sakshi News home page

బాసరలో నగదు రహిత లావాదేవీలు

Published Tue, Dec 27 2016 4:48 PM

cashless transactions in basara temple

 - ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం
 
బాసర: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నగదు రహిత లావాదేవీలకు నూతన సంవత్సరం ఆరంభం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని కూడా జనవరి ఒకటో తేదీ నుంచే ప్రారంభించనున్నారు. రూ. 1000, రూ.500 నోట్ల రద్దుతో బాసరలోని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ ప్రత్యేకంగా దృష్టి సారించి అన్ని విభాగాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
 
అన్ని కౌంటర్లలో స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. చిల్లర కొరత సైతం ఈ మిషన్ల ఏర్పాటు తో తీరనుంది. కాగా, ఆలయంలో స్వీపర్, ఉద్యోగులు, అర్చకులు, ఎన్‌ఎంఆర్‌లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు సుమారు 180 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. 30 నిమిషాలు ఆలస్యమైతే గైర్హాజరుగా నమోదు అవుతుందని ఈఓ తెలిపారు. 

Advertisement
Advertisement