ఉపాధ్యాయుల పోస్టుల్లో ఆంక్షలు సరికాదు | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల పోస్టుల్లో ఆంక్షలు సరికాదు

Published Wed, Feb 8 2017 1:08 PM

ఉపాధ్యాయుల పోస్టుల్లో ఆంక్షలు సరికాదు - Sakshi

హైదరాబాద్‌: కేసీఆర్‌ పాలన మూడడుగులు ముందుకి రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారిందని సీపీఐ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి ఎద్దేవ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల ప్రచారంలో చూపుతున్న చిత్తశుద్ధి పాలనలో కనిపించడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఇవ్వలేదని.. ఇచ్చినా కొంతమందికి ఉపయోగం లేకుండా భూమి దళారుల చేతిలోకి చేరిందని దుయ్యబట్టారు. ఎస్సీలకు ఇచ్చిన ట్రాక్టర్లు కూడా ఇతరులు వాడుకుంటున్నారని.. అసలైన లబ్ది దారులకు ఉపయోగం లేకుండా పోయిందన్నారు. గురుకుల ఉపాధ్యాయుల పోస్ట్‌లలో ఫస్ట్‌ క్లాస్‌ ఉంటేనే అర్హత లాంటి ఆంక్షలు పెట్టడం సరికాదని.. వెంటనే నిబంధనలు మార్చాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement