ఆగ్రా పట్టణం.. మిట్టమధ్యాహ్నం.. రద్దీగా ఉన్న ఓ షూ షోరూమ్‌లోకి చేతులకు సంకెళ్లతో ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతడి వెనుకే సాయుధులైన 12 మంది పోలీసులూ వచ్చారు. దర్జాగా సోఫాలో కూర్చున్న ఆ సంకెళ్ల వ్యక్తి.. పోలీసులందరికీ ఖరీదైన షూ చూపించమని సేల్స్బాయ్ని ఆదేశించాడు.
షోరూమ్ ఓనర్‌కు ఇదంతా వింతగా అనిపించింది. సంకెళ్లతో ఉన్న ఖైదీ.. పోలీసులకు బూట్లు కొనివ్వమేమిటనే ఆశ్యర్యంలోనే తనకు పరిచయమున్న మీడియా మిత్రులకు ఫోన్ చేశాడు. చేతిలో కెమెరాలతో ఒక్కో విలేకరి అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన పోలీసులు మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు.
తర్వాత తెలిసిన సంగతేమంటే పోలీసులకు బూట్లు ఇప్పించిన ఆ నిందితుడు సాదాసీదా నేరస్తుడుకాదు.. కరడుగట్టిన దొంగ, హంతకుడు. పేరు మనోజ్ బక్కర్ వాలా. ఇతడిపై 10 రాష్ట్రాల్లో దాదాపు 300 వందలకుపైగా కేసులున్నాయి. ఖరీదైన కార్లు దొంగిలిస్తూ విలాసాలకు అలవాటుపడ్డ బక్కర్ వాలా.. 2010లో తన గర్ల్ ఫ్రెండ్ భర్త కుటుంబాన్ని అతి దారుణంగా చంపేశాడు.
2012లో అరెస్టయిన తర్వాత మూడు సార్లు జైలు నుంచి పరారయ్యాడు. అలాంటి నేరస్తుడి నుంచి బూట్లు తీసుకోవడం ఒక తప్పైతే, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం శిక్షార్హం. అందుకే మొత్తానికి మొత్తం 12 మంది పోలీసుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఢిల్లీ, ఆగ్రా ఎస్పీలు ప్రకటించారు.
ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటోన్న మనోజ్ బక్కర్వాలాను ఓ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం ఆగ్రా కోర్టుకు తీసుకెళ్లారు. ఢిల్లీకి చెందిన ఆరుగురు సాయుధ పోలీసులు, ఆగ్రాకు చెందిన మరో ఆరుగురు పోలీసులను మనోజ్‌కు గార్డులుగా నియమితులయ్యారు. ఉదయం 11:30కు విచారణ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ తతంగం చోటుచేసుకుంది.
బూట్ల కోసం ఆశపడి అడ్డంగా బుక్కైన పోలీసులు
Published Sat, Aug 29 2015 1:06 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement