కరెన్సీకి ప్రత్యేకం! | Sakshi
Sakshi News home page

కరెన్సీకి ప్రత్యేకం!

Published Thu, Dec 1 2016 1:20 AM

కరెన్సీకి ప్రత్యేకం! - Sakshi

సాక్షి, చెన్నై: ఒకటో తేదీన కరెన్సీ కష్టాలు మరింత జఠిలం కాకుండా ప్రత్యేక ఏర్పాట్ల మీద బ్యాంకులు దృష్టి పెట్టాయి. ప్రధాన ప్రాంతాల్లోని ఏటీఎంలలో రోజుకు రెండు సార్లు నగదును లోడ్ చేయడానికి నిర్ణయించారు. ఇక బుధవారం సాయంత్రం నుంచి ఏటీఎంల వద్ద జనం క్యూ కట్టడంతో గురువారం పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ తప్పలేదు. నల్లధనం కట్టడి వ్యవహారం నోట్ల సమస్యకు దారి తీసిన విషయం తెలిసిందే. కొత్త నోట్ల కోసం జనం మూడు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో డిసెంబరు ఒకటి వేతన దినం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, సిబ్బంది ఒకేసారిగా బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరడం ఖాయం. ఇక, నోట్ల సమస్యతో అద్దె చెల్లింపులు, ఇంటిఖర్చుల నిమిత్తం కష్టాలు ఎక్కడ ముంచుకొస్తాయో అన్న ఆందోళన ఏర్పడింది. 
 
 నల్లధనం అరికట్టే నిర్ణయం  ఉత్తర్వుల తదుపరి వస్తున్న తొలి జీతం కావడంతో రాష్ట్రంలో లక్షలాది మంది బ్యాంకులు, ఏటీఎంల మీద ఆధారపడక తప్పడం లేదు. ఇక, బ్యాంకుల్లో అయితే, తొమ్మిది వేలలోపు, ఏటీఎంలలో అయితే, రూ. 2వేల వరకు నగదు తీసుకునేందుకు పరిమితం ఉండడంతో తిప్పలు తప్పవేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ప్రత్యేకం : జీతం రోజును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఒకటి, రెండో తేదీల్లో అన్ని ఏటీఎంలలోనూ నగదు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఐటీ తదితర సంస్థలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో అక్కడి సిబ్బంది కోసం ప్రత్యేకంగా మొబైల్, మినీ ఏటీఎంలను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ప్రైవేటు సంస్థలు అయితే, రోజుకు రెండు సార్లు నగదును ఏటీఎంలలో పొందు పరిచేందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుని ఉండడం ఆహ్వానించదగ్గ విషయమే. 
 
 అలాగే, రద్దీని బట్టి బ్యాంక్‌ల వద్ద, ఏటీఎంల వద్ద ప్రత్యేక కౌంటర్లను ప్రైవేటు బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారుు. రిజర్వు బ్యాంక్ వర్గాలు సైతం నగదు కష్టాలను తీర్చే విధంగా పర్యవేక్షణలో పడ్డారు. అరుుతే, ఏ మేరకు నగదు కష్టాల్ని అధిగమించేందుకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నారో అన్నది గురువారం తేలనుంది. కాగా, కొన్ని ఏటీఎంల వద్ద బుధవారం సాయంత్రం నుంచే జనం బారులు తీరడం గమనార్హం.  ఇక, కోయంబత్తూరు రీజియన్‌లో డిపాజిట్ చేసిన పాత నోట్లను బుధవారం నాలుగు కంటైనర్లలో చెన్నైకు  తరలించారు. గట్టి భద్రత నడుమ రూ. 2,155 కోట్ల మేరకు పాత నోట్లు చెన్నైకు రానున్నారుు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రవాణా ఉద్యోగ కార్మికులకు నెల జీతంలో అడ్వాన్‌‌సగా రూ.మూడు వేలను ప్రభుత్వం చేతికి ఇవ్వడం విశేషం. ఆయా బస్సు డిపోలు, కార్యాలయాల వద్ద సిబ్బందికి రూ.మూడు వేల చొప్పున వంద, కొత్త రెండు వేల నోట్లను అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల్లో జమచేశారు. రవాణా సంస్థ చేపట్టినట్టుగా అన్ని విభాగాల్లోనూ చేతికి కొంత మేరకు నగదు ఇచ్చి ఉంటే బాగుండేదని ప్రభుత్వ ఉద్యోగులు పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement