'చీఫ్‌ కమిషనర్‌ను నియమించాలి' | Sakshi
Sakshi News home page

'చీఫ్‌ కమిషనర్‌ను నియమించాలి'

Published Thu, Oct 13 2016 12:41 PM

Demands over Right to Information Act Chief Commissioner appointment

ఒంగోలు : సమాచార హక్కు చట్టం చీఫ్‌ కమిషనర్‌ను వెంటనే నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ సమాచార హక్కు సంఘం రాష్ట్ర కార్యదర్శి జి. బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి పుష్కర కాలమైనా ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉందని విచారం వ్యక్తం చేశారు. 2010లో నియమించిన చీఫ్‌ కమిషనర్‌ జన్నత్‌హుస్సేన్‌ అనంతరం ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదన్నారు. 

నూతన ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఉమ్మడి కమీషన్‌ కార్యాలయం హైదరాబాద్‌లోనే కొనసాగుతోందన్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా స్థానికంగా పరిష్కారం కాకపోవడంతో సంబంధిత వ్యక్తులు హైదరాబాద్‌ వెళ్లలేక మధ్యలోనే ఆగిపోతున్నారన్నారు. కమిషనర్ల సంఖ్యను పెంచి చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  కేసులు వాయిదా వేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సమాచార హక్కు చట్టం అమలుచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా కో ఆర్డినేషన్‌ కమిటీని కలెక్టర్‌ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement