దేవా.. పైసలు రావా..! | Sakshi
Sakshi News home page

దేవా.. పైసలు రావా..!

Published Tue, Oct 18 2016 11:57 AM

Devadula channels construction compensation

మూడేళ్లుగా ఎదురుచూస్తున్న బాధితులు
ఏడాది కౌలు డబ్బులు ఇచ్చి వితులు దులుపుకున్న కాంట్రాక్టర్‌
అధికారులు పట్టించుకోవాలని రైతుల విజ్ఞప్తి
కాల్వల నిర్వాసితులకు అందని పరిహారం
 
దేవాదుల కాల్వల నిర్మాణం రైతులను నట్టేట ముంచింది. వీటితో సాగునీరందడం దేవుడెరుగు కానీ.. భూములు ఇచ్చిన వారికి పరిహారం అందడం లేదు. ఫలితంగా రెండు పంటలు పండే భూములు కోల్పోయి వారు ఆక్రందనలకు గురవుతున్నారు. 
 
జఫర్‌గఢ్‌ : దేవాదుల వరద కాల్వల నిర్మాణం.. రైతులకు ఆశనిపాతంగా మారింది. కాల్వలకు భూములు అందిస్తే ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం వచ్చి ఇతర పనులు చేసుకుందామని భావించిన వారికి భంగపాటే ఎదురైంది. భూములు కోల్పోయి మూడేళ్లవుతున్నప్పటికీ నేటికి ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ద్వారా స్టేష¯ŒSఘ¯ŒSపూర్, ధర్మసాగర్‌లో చేపట్టిన రిజర్వాయర్ల నుంచి మండలంలో సాగునీరందించేందుకు చర్యలు తీసుకుం ది. ఇందులో భాగంగా దేవాదుల ఫేజ్‌–1, ఫేజ్‌– 2, ఫేజ్‌–3కి సంబంధించిన వరద కాల్వల నిర్మాణ పనులు మం డలంలోని పలు గ్రామాల మీదుగా చేపట్టారు. ప్రధానంగా రఘునాథపల్లి, జఫర్‌గఢ్‌ మండలంలోని ఉప్పుగల్లు, తమ్మడపల్లి (ఐ), తిమ్మంపేట, కోనాయిచలం, శంకర్‌తండా, వడ్డెగూడెం తదితర గ్రామాల శివారు మీదుగా పంట పొలాల మధ్య కాల్వలను నిర్మిం చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన వందలాది ఎకరాల పం ట భూములు అందులో కోల్పోయాయి. ఒక్కో రైతు కనీసం 20 గుంటల నుంచి రెండెకరాల వరకు భూములు కాల్వల నిర్మాణానికి అప్పగించారు. అయితే కాల్వల కోసం భూ సేకరణ చేపట్టేందుకు సంబంధిత అధికారులు సర్వే చేస్తున్న సమయంలో బాధిత రైతులు పలుమార్లు వారిని అడ్డుకున్నారు. ముందుగా తమకు నష్ట పరిహారం చెల్లిం చిన తర్వాతనే భూముల మీదుగా కాల్వల నిర్మాణం చేపట్టాలని, లేకుంటే పనులు జరగనివ్వమని తెలి పారు.  దీంతో అధికారులు కాల్వల కింద భూ ములు కోల్పోయిన రైతులకు తప్పకుండా ప్ర భుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పిస్తామని.. అప్పటి వరకు ఏడాది పాటు పంట కౌలు అందజేస్తామని నచ్చజెప్పి పనులు చేపట్టారు.
 
మూడేళ్లుగా జాడలేరు..
దేవాదుల కాల్వల నిర్మాణానికి భూములు అప్పగించిన ఒక్కో రైతుకు తొలుత సంబంధి త కాంట్రాక్టర్‌ ఏడాది కౌలు డబ్బులు ఇచ్చారు. ఎకరాకు రూ. 8 వేల చొప్పున డబ్బులు చెల్లించడంతో రైతులు పనులకు అనుమతించారు. వాస్తవంగా ఒక్కో ఎకరాకు రూ.6 లక్షలు చెల్లిస్తామని రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు.. కాల్వల నిర్మాణ పనులు చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వారిని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో వారు లబో దిబోమంటున్నారు. నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు,  సంబంధిత కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు జాడ లేకపో వడంతో పరిహారం డబ్బులు ఎవరిని అడగాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తమకు పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. 
 
మూడెకరాలకు పైగా పోయింది..
దేవాదుల కాల్వ కింద నా భూమి మూడెకరాలకు పైగా పోయింది. భూములు తీసుకున్న తర్వాత ఏడాదిలోగా పరిహారం ఇస్తామని చెప్పిండ్లు. మూడేళ్లవుతున్నా ఇప్పటివరకు నయాపైసా రాలేదు. పనులు చేయించిన అధికా రులు, కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు జాడలేరు. పెద్దసార్ల చుట్టూ తిరిగినా పరిహారం రావడం లేదు. ప్రభుత్వం స్పందించి నాలాంటి రైతులను ఆదుకోవాలి.
–మామిడి స్వామి, జఫర్‌గఢ్‌
 
పరిహారం చెల్లించి ఆదుకోవాలి..
నేను మూడేళ్లుగా ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తున్నా. ఇప్పటి వరకు అందలేదు. భూములు ఇచ్చినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. కాల్వల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌ ఏడాది కౌలు డబ్బులు ఇచ్చి తర్వాత కనిపించడంలేదు. కాల్వల కింద నాకు మూడున్నర ఎకరాల భూమి పోయింది.   
–మామిడి మల్లయ్య, జఫర్‌గఢ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement