దినకరన్‌ దిష్టిబొమ్మ దహనం | Sakshi
Sakshi News home page

దినకరన్‌ దిష్టిబొమ్మ దహనం

Published Fri, Aug 25 2017 4:42 AM

దినకరన్‌ దిష్టిబొమ్మ దహనం

వేలూరు: జిల్లా కార్యదర్శి పదవి నుంచి మంత్రి కేసీ.వీరమణిని తొలగించడాన్ని ఖండిస్తూ కార్యకర్తలు టీటీవీ.దినకరన్‌ దిష్టి బొమ్మలు దహనం చేశారు. జిల్లా కార్యదర్శిగా వీరమణిని తొలగించి ఎమ్మెల్యే బాలసుబ్రమణ్యంను నియమించడంతో దినకరన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.  మాదనూర్, ఆంబూరు, వానియంబాడి,, తిరుపత్తూరు, గుడియాత్తం ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు దినకరన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆయన చిత్ర పటాలను దహనం చేస్తున్నారు. గురువారం ఉదయం వేలూరు ఎంజీఆర్‌ మండ్ర జిల్లా కార్యదర్శి నారాయణన్‌ అధ్యక్షతన కార్యకర్తలు అధిక సంఖ్యలో వేలూరు పాత కార్పొరేషన్‌ కార్యాలయం చేరుకుని దినకరన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. దినకరన్‌ వెంటనే పార్టీ నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది.

 గుడియాత్తం ఎమ్మెల్యే కార్యాలయానికి తాళం
గుడియాత్తం ఎమ్మెల్యే జయంతి పద్మనాభన్‌ దినకరన్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ గుడియాత్తం పట్టణ కార్యదర్శి పయణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆమె దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు కార్యాలయానికి తాళం వేశారు.

Advertisement
Advertisement