అన్నా నీవే దిక్కు!

26 Jul, 2016 02:41 IST|Sakshi
అన్నా నీవే దిక్కు!

అప్పుల ఊబిలో డీఎండీకే అభ్యర్థులు
 కెప్టెన్ ఎదుట కన్నీళ్లు
 త్వరలో తలా రూ. పది లక్షలు?

 
 సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా సమస్యలు  చుట్టుముడుతున్నాయి. పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీని గట్టేక్కించేందుకు తీవ్ర  కుస్తీలు పడుతున్న ఈ కెప్టెన్‌కు రోజు రోజుకు షాక్‌లు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. ఎన్నికల బరిలో నిలబడి అప్పుల ఊబిలో మునిగిన అభ్యర్థులు ‘అన్నా’ ఇక నీవే దిక్కు అంటూ కోయంబేడు వైపుగా భార్య పిల్లలతో కలిసి పడగలెత్తే పనిలో పడ్డారు.
 
  రాష్ర్టంలో కింగ్ మేకర్‌గా అవతరించిన ఉన్న విజయకాంత్ ‘కింగ్’ కావాలన్న ఆశతో కుదేల్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం పగ్గాలు చేపట్టినట్టే అన్న ధీమాతో ముందుకు సాగిన కెప్టెన్ ప్రస్తుతం బయటకు అడుగు తీసి పెట్టడం లేదు. ఇళ్లు, పార్టీ కార్యాలయంకు పరిమితం అవుతూ, మీడియా కంట పడకుండా సమీక్షలు, సమావేశాలు అంటూ కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు చెమటోడ్చుతున్నారు. పార్టీ నుంచి ముఖ్య నేతలు, జిల్లాల కార్యదర్శులు దా దాపుగా బయటకు వెళ్లారు.
 
  ఉన్న వాళ్లను రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న విజయకాంత్‌కు, వారి రూపంలో కొత్త సమస్యలు బయలు దేరుతున్నాయి. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బయటకు వెళ్లడంతో ఆయా నియోజకవర్గాల్లో తన వెన్నంటి  ఉన్న నాయకుడ్ని అభ్యర్థిగా ప్రకటించి, ఎన్నికల్ని లాగించేశారు. ఎన్నికల్లో తమ డిపాజిట్లు గల్లంతు కావడమే కాకుండా, ఆయా నాయకులు అప్పల ఊబిలో మునగాల్సిన పరిస్థితి. అసెంబ్లీలో అడుగు పెట్టినట్టే అన్న ధీమాతో అప్పో, సొప్పో  చేసి ఖర్చు పెట్టారు.
 ఆర్థికంగా దెబ్బతిన్నాం: రాష్ర్టంలో ప్రజా సంక్షేమ కూటమి తరఫున డీఎండీకే అభ్యర్థులు 104 చోట్ల పోటీకి దిగారు.
 
 ఇందులో పది.. పదిహేనుమంది మినహా తక్కిన వాళ్లం తా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి ఎంపిక చేసిన అభ్యర్థులే. వీరికి ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరపున నిధులు అందించేందుకు కార్యాచరణ జరిగినట్టు సమాచారం. అయితే, మెజారిటీ శాతం మందికి పార్టీ నిధి చేరక పోవడం, చివరకు అప్పో సొప్పో చేసి ఎన్నికల ఖర్చు పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఆ అప్పులు వడ్డీలతో నెత్తిమీదకు ఎక్కడంతో అన్న నీవేదిక్కు అంటూ కుటుంబాలతో కలసి కోయంబేడుకు కార్యాలయానికి ఉరకలు తీస్తున్నారు.
 
 తలా రూ. పది లక్షలు:  అన్న పిలిస్తే తప్ప పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానం ఉండదన్న విషయాన్ని పసిగట్టిన ఆయా అభ్యర్థులు చడీచప్పుడు కాకుండా చెన్నైకు చేరుకుంటున్నారు. ఆదివారం తిరుచ్చి,సేలం, ధర్మపురి, కాంచీపురం, విల్లుపురం తదితర పది జిల్లాల్లో ఓడిపోయి న అభ్యర్థులు తమ కుటుంబాలతో పార్టీ కార్యాలయానికి వచ్చి ఉన్నారు. కుటుంబంతో కలిసి అన్నతో ఫోటో దిగాలన్న ఆశతో వచ్చినట్టు లోనికి అడుగులు పెట్టినట్టు సమాచారం. అన్నతో అభ్యర్థులు సమాలోచనలో ఉంటే, వారి కుటుంబాలు కన్నీళ్ల పర్వంతో ఇక దిక్కు నీవే అంటూ విలపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
 
 పార్టీ కోసం, ఎన్నికల కోసం శ్రమించి అప్పుల ఊబిలో కొట్టు మిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసి ఉన్నారు. ఇప్పడు పార్టీలో తాము కొనసాగాలంటే, అప్పల ఊబి నుంచి  గట్టెక్కించాల్సిందేనంటూ విజయకాంత్  కాళ్ల మీద పలువురు అభ్యర్థులు పడి మరీ కన్నీళ్లు పెట్టినట్టు సమాచారం. ఎన్నికల నిధిగా రూ. పది లక్షలు చొప్పున ఇస్తామన్నారని, అయితే, అది తమకు అందని దృష్ట్యా, ఇప్పుడైనా ఇస్తే, కొంత మేరకు గట్టెక్క గలమని తమ అధినేతకు విన్నవించుకుంటున్నట్లు సమాచారం.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా