ముంబైలో ప్రేమికుల ఆచూకీ లభ్యం | Sakshi
Sakshi News home page

ముంబైలో ప్రేమికుల ఆచూకీ లభ్యం

Published Sat, Dec 23 2017 6:06 AM

escaped bride Caught in mumbai with boyfriend - Sakshi

మంగళూరు(సాక్షి,బెంగళూరు): వివాహానికి రెండు రోజుల ముందు ఇంట్లో ఉంచిన ఆభరణాలు, డబ్బు, పాస్‌పో ర్ట్, ఆధార్‌కార్డుతో సహా యువతి ప్రేమికుడితో కలసి పా రిపోయిన కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీ సులు శుక్రవారం యువతిని ఆమె ప్రియుడిని ముం బ యిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళూ రు నగరంలోని మూడబిదిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధరగుడ్డె ప్రాంతానికి చెందిన ప్రియాంక ఇదే నెల 9న ప్రియుడితో కలసి పారిపోయింది. దీనిపై ప్రియాంక తల్లి తండ్రులు, హిందూ సంఘాలు ఇది ముమ్మాటికీ లవ్‌జిహాదేనని, గత కొద్ది కాలంగా ప్రియాంక ఇనోళి ప్రాం తానికి చెందిన హైదర్‌ అనే యువకుడితో ప్రేమలో ఉంద ని ప్రియాంకను హైదర్‌ మాయమాటలతో నమ్మించి తనతో పాటు తీసుకెళ్లి ఉంటాడని మూడబిదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలిసాయి. కొద్ది సంవత్సరాల క్రితం ప్రియాంక కుటుంబం కోణాజీ సమీపంలోని ఇనోళిలో నివసించేవా రు.

ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన హైదర్‌ అనే వ్యక్తితో ప్రియాంకకు పరిచయమైంది. అనతికాలంలో వీరి పరిచయం ప్రేమకు దారి తీయడంతో విషయం తెలుసుకున్న ప్రియాంక తల్లితండ్రులు అక్కడి నుంచి మూడబిదిరికి మకాం మార్చారు. అప్పటికీ ప్రియాంక తల్లితండ్రులకు తెలియకుండా హైదర్‌తో ప్రేమను కొనసాగిస్తుండేది. అంతేకాకుండా ప్రియాంక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచి ప్రియాంక బ్యాంకు ఖాతాలో లక్షల కొద్ది డబ్బు జమవుతున్నట్లు తెలిసింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న ప్రియాంక ఈనెల 9న ప్రియాంక ఇంట్లోనున్న ఆభరణాలు, పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డు తీసుకొని పారిపోయింది. ప్రియాంకను తీసుకొని ముంబయికి చేరుకున్న ఆమె ప్రియుడు హైదర్‌ తన స్నేహితుడు ఝమీర్‌ సహాయంతో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. శుక్రవారం ప్రేమికులతో పాటు వారికి సహకరించిన ఝమీర్‌ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురిని విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement