సహకార బ్యాంకుల్లో పెద్దనోట్లు నిరాకరణ

15 Nov, 2016 13:56 IST|Sakshi
- రైతుల ఆందోళన
 
రామన్నపేట: నల్గొండ జిల్లా రామన్నపేటలోని సహకార బ్యాంకుల్లో, సింగిల్ విండో సొసైటీల్లో రూ.500, రూ.1000 నోట్లు తీసుకోకపోవడంతో రైతులు మంగళవారం ధర్నా చేశారు. విత్తనాల కోసం వచ్చిన రైతులు తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 రూపాయల నోట్లను తెచ్చారు. అయితే సహకార బ్యాంకు, సింగిల్ విండో సొసైటీల్లో ఆ నోట్లు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. భువనగిరి రోడ్డుపై ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించాయి.
మరిన్ని వార్తలు