పార్టీ పతాకంలో ఆ ఇద్దరు.. | Sakshi
Sakshi News home page

పార్టీ పతాకంలో ఆ ఇద్దరు..

Published Thu, Nov 27 2014 2:56 AM

పార్టీ పతాకంలో ఆ ఇద్దరు.. - Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్ర మాజీ మంత్రి జీకే.వాసన్ తాను స్థాపించబోయే కొత్తపార్టీ పతాకాన్ని బుధవారం ఆవిష్కరించా రు. త్రివర్ణాల నడుమ మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, దివంగత జీకే.మూపనార్ ఫొటోలతో పతాకాన్ని తీర్చిదిద్దారు. పార్టీ పేరు శుక్రవారం ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అధిష్టాన వైఖరితో విభేదించిన జీకే.మూపనార్ 1996లో తమిళమానిల కాంగ్రెస్‌ను స్థాపించారు. మూపనార్ మరణం తర్వాత ఆయన తనయుడు జీకే.వాసన్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. వాసన్ సైతం తన తండ్రిబాటలోనే కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల సమయంలో సభ్యత్వ కార్డులపై కామరాజనాడార్, మూపనార్ ఫొటోలను ప్రచురించరాదన్న కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని వాసన్ వ్యతిరేకించారు.
 
 అంతేగాక సొంతపార్టీ స్థాపనకు సిద్ధమయ్యూరు. కాంగ్రెస్‌లో ఏ ఇద్దరు నేతలకైతే (కామరాజనాడార్, మూపనార్) అవమానం జరిగినట్లు వాసన్ భావించారో వారి ఫొటోలనే తన పతాకానికి వినియోగించుకున్నారు. జాతీయ పతాకాన్ని పోలిన ఆరంజ్, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన పతాకం మధ్యలో ఇద్దరి ఫొటోలను ఉంచారు. చెన్నై శాంతోమ్ చర్చ్ సమీపంలోని కమ్యూనిటీ హాలులో బుధ వారం ఉదయం 10 గంటలకు అభిమానుల హర్షధ్వానాల మధ్య జీకేవాసన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కామరాజనాడార్ పాలనకు తమ పార్టీ అంకితం అవుతుందని అన్నా రు. తమిళనాడులోని కుగ్రామాల నుంచి మహా నగరాల వరకు పార్టీ పతాకం రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28న తిరుచ్చిలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు ఇదే పతాకాలతో హాజరుకావాలని సూచించారు. సభ అనంతరం వాసన్ మీడియూతో మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండ దని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు ఆ నాటి విషయమని దాటవేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ సీసీ మాజీ అధ్యక్షులు జ్ఞానదేశికన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement