మృత్యు పిడుగులు

10 May, 2017 09:38 IST|Sakshi
మృత్యు పిడుగులు

► పిడుగు పాటుతో నలుగురు మృతి
► చిత్రదుర్గం జిల్లాలో ఘోరాలు


సాక్షి, బళ్లారి :  చిత్రదుర్గం జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై నలుగురు మరణించారు.  చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వాణివిలాస సాగర(మారికణివె) పోటు జలాల్లో ఈత కొట్టేందుకు కురుబరహళ్లి గ్రామానికి చెందిన 9 మంది వెళ్లగా పిడుగు పడటంతో లెక్చరర్‌ మాలేశ్‌ నాయక్‌(30), ఉపాధ్యాయుడు ఛాయాపతి, డ్రైవర్‌ హరీష్‌లు మృతి చెందారు. దీంతో కురుబరహళ్లి గ్రామం విషాదంలో మునిగి పోయింది. ఈ ఘటనపై హిరియూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో మొళకాల్మూరు తాలూకా బండ్రావి సమీపంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన జంబక్క(35) అనే మహిళ మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మరణించింది. ఈ ఘటనపై మొళకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా