రేయింబవళ్లు కొత్త నోట్ల ప్రింటింగ్ | Sakshi
Sakshi News home page

రేయింబవళ్లు కొత్త నోట్ల ప్రింటింగ్

Published Wed, Nov 16 2016 4:25 PM

రేయింబవళ్లు కొత్త నోట్ల ప్రింటింగ్ - Sakshi

ముంబై: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ ప్రెస్ పై కూడా పడింది. ప్రెస్ సిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఓ వైపు రద్దుకు ముందుగా ముద్రించి సిద్దంగా ఉంచిన సుమారు రూ. 20 వేల కోట్ల రూ. 500, 1000 నోట్లను కాల్చి బూడిద చేయాల్సిన పరిస్థితి ఏర్పడగా మరోవైపు నోట్ల కొరత ఉండకుండా ప్రింటింగ్ సామర్ధ్యాన్ని పెంచాల్సి వచ్చింది. దీంతో నాసిక్‌లోని ప్రెస్ పై పని ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఇక్కడి సిబ్బంది దేశంలో చిల్లర కొరత ఉండకుండా ఉండేందుకు రాత్రీపగలూ తేడా లేకుండా పని చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే ముద్రించిన 7.40 కోట్ల కొత్త రూ. 500 నోట్లతో పాటు రూ.100, రూ.20 నోట్లను రిజర్వు బ్యాంకుకు అందచేశారు. దీంతో ఈ నోట్లన్నీ బ్యాంకులు, ఏటీఎంలలోకి అందుబాటుకి రానున్నాయి. దేశంలో మొత్తం తొమ్మిది సిక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లున్నాయి. వీటిలో ఒక్కటైన నాసిక్ ప్రెస్ లో ముద్రిస్తున్న నోట్లను విడతులుగా రిజర్వ్‌బ్యాంకుకు అప్పగిస్తున్నారు. అనంతరం అవి మార్కెట్లో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement