మళ్లీ బడిబాట పట్టిస్తాం | Sakshi
Sakshi News home page

మళ్లీ బడిబాట పట్టిస్తాం

Published Sat, Aug 23 2014 10:28 PM

మళ్లీ బడిబాట పట్టిస్తాం - Sakshi

ముంబై: చదువు మధ్యలోనే మానేసిన వారు తిరిగి బడికి వెళ్లేవిధంగా చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది చివరిలోగా ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర ్భంగా ప్రసంగించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి పలికి ఉద్యోగం వైపు మళ్లినవారిని మళ్లీ బడిబాట పట్టిస్తామని అన్నారు. వీరు పీహెచ్‌డీ వరకూ చదువుకునేవిధంగా అన్నివసతులు కల్పిస్తామన్నారు.
 
 విద్యలో స్పెషలైజేషన్‌కు సంబంధించినంతవరకు గిరిజనులు, మహిళలు, షెడ్యూల్ కులాలకు చెందిన చిన్నారులు, ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారికి ఉన్నత విద్యాభ్యాసానికి తగినన్ని ఆర్థిక వనరులు అందుబాటులో ఉండవన్నారు. దీంతో వారు మధ్యలోనే చదువుకు స్వస్తి పలుకుతారన్నారు. ఇందుకు కారణం వారికి చదువుకంటే ఉద్యోగమే ముఖ్యం కావడమన్నారు. చివరికి తానుకూడా తగినంత ఆర్థిక వెసులుబాటు లేని కారణంగానే మధ్యలోనే చదువుకు స్వస్తి పలికానన్నారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలుగా ఎదగగల సామర్థ్యమున్న వారికోసమే ‘ఇషన్ వికాస్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
 
 ఇటువం టి విద్యార్థులు దేశంలోని ప్రముఖ సంస్థలను సందర్శించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నా రు. 2,200 మంది విద్యార్థులను ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. వారికోసం అవగాహనా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం దేశవాసులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సాహమందిస్తామన్నారు. ప్రతిరోజూ పిల్లలు బడికి వెళుతున్నారా? అక్కడ వారు ఏమిచేస్తున్నారు? ఇచ్చిన హోంవర్క్ చేస్తున్నారా? లేదా? తదితరాలకు సంబంధించిన సమాచారం వారి తల్లిదండ్రులకు ప్రతిరోజూఅందేవిధంగా చేస్తామని, ఇది వచ్చే ఏడాదినుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
 

Advertisement
Advertisement