కుటుంబం సహా హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

కుటుంబం సహా హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Published Wed, May 24 2017 2:11 AM

కుటుంబం సహా హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం - Sakshi

యలహంక: వ్యక్తిగత కారణాలతో కుటుంబం సహా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు యత్నించగా   భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.   ఈ ఘటన మంగళవారం సంపిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బళ్లారికి చెందిన సుభాష్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ సంపిగేహళ్లిలోని పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు.  

సోమవారం రాత్రి ఎప్పటిలాగే ఇరుగుపొరుగు కుటుం బాల వారికి సాధారణంగానే కనిపించిన సుభాష్‌ కుటుంబ సభ్యులు మంగళవారం ఎంత సేపటికి బయటకు రాలేదు. అదే సమయంలో అక్కడకు వచ్చిన సుభాష్‌  సుభాష్‌ అన్న తలుపు కొట్టగా  స్పందన రాలేదు. దీంతో ఇరుగుపొరుగు వ్యక్తుల సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా సుభాష్‌తో పాటు ఆయన భార్య వీణ (28), పిల్లలు పృ«ధ్వీ (1), మాన్య (మూడు నెలలు)లు చలనం లేకుండా పడి ఉన్నారు.

  వెంటనే నలుగురిని సమీప ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంందుతూ వీణ, పృ«ధ్వీ, మాన్యలు మృతి చెందగా సుభాష్‌   కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.  ఎలుకల మందు తినడం వల్లే   వీణ,   ఫృధ్వి, మాన్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సుభాష్‌ను బాప్టిస్ట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే సుభాష్‌ ప్రైవేటు వ్యక్తుల నుంచి లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారని, దీంతో అప్పులు తీర్చే మార్గం కనపడకే  ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని కేసు నమోదు చేసుకున్న సంపిగేహళ్లి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 2008లో సీఏఆర్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన సుభాష్‌ చంద్ర   ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డ కారణాలు విచారణలో వెలుగు చూస్తాయంటూ ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఏఆర్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ డీ.సీ.రాజప్ప తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement