Sakshi News home page

వర్షం గుప్పిట ముంబై

Published Sat, Aug 6 2016 3:34 AM

వర్షం గుప్పిట ముంబై

స్తంభించిన రైల్వే సేవలు..
బిహార్‌లో 25 మంది మృతి

ముంబై: ఎడతెరపిలేని వానలకు ముంబై నగరం, పరిసర ప్రాంతాలు అతలాకుతం అయ్యాయి. శుక్రవారం పొద్దున్నుంచీ కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.  రవాణాలో ఇబ్బందులేర్పడ్డాయి.  రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కొన్నిచోట్ల్ల పట్టాలపైకి నీరు చేరడంతో శివార్లలో రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. విమాన సేవలను కూడా తాత్కాలికంగా నిలివేశారు. బస్సులు తిరిగే మార్గాల్లో పలు మార్పులు చేశారు. సాయంత్రం వరకు  సుమారు 100 మీ.మీల వర్షపాతం నమోదైనట్లు అంచనా.

రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చనివాతావరణ శాఖ అంచనా వేసింది.  నగరవ్యాప్తంగా పాఠశాలలకు  సెలవు ప్రకటించారు. థానేను కూడా భారీ వ ర్షాలు ముంచె త్తాయి. సావిత్రి నదిపై వంతెన కూలిన దుర్ఘటనలో శుక్రవారం మరో 8 మృతదేహాలను గాలింపు బృందాలు క నుగొన్నాయి. దీంతో ఇప్పటి వరకు దొరికిన మృతదేహాల సంఖ్య 22కు పెరిగింది. మరోపక్క.. బిహార్‌లో వరద మృతుల సంఖ్య 89కి చేరింది. వర్ష సంబంధ ఘటనల్లో శుక్రవారం ఒక్క రోజే 25 మంది చనిపోయారు.

Advertisement
Advertisement