ప్రోత్సాహకం | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహకం

Published Sat, Jan 11 2014 3:03 AM

Incentive

= ఒకటో తరగతి బాలికలకు రోజుకు రూ. 2
 = మంత్రి వర్గ నిర్ణయం

 
సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి చదువుతున్న బాలికలకు హాజరైన ప్రతి రోజుకు రూ.2 చొప్పున ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను న్యాయశాఖ మంత్రి టీబీ. జయచంద్ర మీడియాకు తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని ఏ విధంగా చెల్లించాలనే విషయమై విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయిస్తారు. సమావేశంలో ఇతర నిర్ణయాలు...
 
జరిమానా చెల్లింపుతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణ

అన్నభాగ్య పథకం కింద ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాల్లో గోధుమల పంపిణీ

హెబ్బాళలోని పశు సంవర్ధక శాఖకు చెందిన భూమిలో రూ.33 కోట్ల వ్యయంతో పశు భవన్ నిర్మాణానికి పాలనా అనుమతి

పీయూసీ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు బీఎడ్ చేయడానికి వీలుగా ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవు మంజూరు

‘లోకాయుక్త’కు చిక్కి నేరనిరూపణ అయిన ప్రభుత్వ అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగింపు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement