‘ప్రగతి’ మైదాన్.. | Sakshi
Sakshi News home page

‘ప్రగతి’ మైదాన్..

Published Sat, Nov 9 2013 12:35 AM

International Trade Mela @ pragthi ground

 సాక్షి, న్యూఢిల్లీ:  అంతర్జాతీయ వాణిజ్య మేళాకు నగరం సిద్ధమవుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే ఈ మేళా కోసం ప్రగతిమైదాన్‌లో ప్రత్యేకంగా పార్కింగ్, మెట్రో టోకెన్ కౌం టర్లు, భద్రత తదితర సన్నాహాలు చేస్తున్నారు. మేళాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు.  దేశ విదేశాలకు చెందిన ఆరు వేల మంది ఎగ్జిబిటర్లు మేళాలో పాల్గొననున్నారు.  కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ తమ రంగాలలో సాధించిన ప్రగతిని ఇందులో ప్రదర్శిస్తాయి. భాగ స్వామ్య దేశ హోదాలో జపాన్, భాగస్వామ్య రాష్ట్ర హోదాలో బీహార్ ఈ మేళాలో పాల్గొం టున్నాయి.
 
  దక్షిణాఫ్రికా వరుసగా ఫోకస్ కంట్రీ హోదాతో మేళాలో పాల్గొననుంది. మేళా మొదటి ఐదు రోజులు వాణిజ్య సందర్శకులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. నవంబర్ 19 నుంచి సామాన్యులకు కూడా మేళాలో ప్రవేశం ఉంటుంది.  భాగస్వామ్య రాష్ట్రంగా మేళాలో  కీలక స్థానాన్ని ఆక్రమించిన బీహార్ పెవిలియన్ ముందుభాగాన్ని సబో ర్ చారిత్రాత్మక వ్యవసాయ విశ్వవిద్యాలయం నమూనాలో తీర్చిదిద్దుతారు. బీహార్ వంటకాల రుచులను అందించేందుకు ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటుచేస్తున్నారు. నవంబర్ 22న  బీహార్  డే గా పాటిస్తారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ సంవత్సరం మేళాలో పాల్గొనే విదేశీ ఎగ్జిబిటర్ల సంఖ్య తగ్గిందని మేళాను నిర్వహించే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) చైర్‌పర్సన్ రీటా మీనన్ తెలిపారు. ఈ ఏడాది 21 దేశాలకు చెందిన 260 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని ఆమె చెప్పారు. గత  ఏడాది మేళాలో 427 మంది విదేశీ ఎగ్జిబిటర్లు పాల్గొన్నారని ఆమె వివరించారు.
 
  యూఎస్, శ్రీలంక, బ ంగ్లాదేశ్ మేళాలో పాల్గొనడం లేదు, దేశీ ఎగ్జిబిటర్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎగ్జిబిషన్ కంపెనీలు, 30 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు వాటి ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సుమారు 5,700 స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నాయని ఆమె వివరించారు. గ్రామీణాభివద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసే కాపార్ట్ పెవిలియన్ దేశం నలుమూలల నుంచి వచ్చిన 800 గ్రామీణ వృత్తి నిపుణులకు వేదిక కానుంది. మేళా సందర్శనకు వచ్చే వారినుంచి  సోమవారం నుంచి  శుక్రవారం వరకు పెద్దలకు రూ.50 , పిల్లలకు రూ. 30 వసూలు చేస్తారు. శని, ఆదివారాలు,సెలవు దినాల్లో మాత్రం పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.50 ప్రవేశరుసుముగా వసూలు చేయనున్నారు. ఉద యం 9.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మేళాలో ప్రవేశించవచ్చు.
 
 
 

Advertisement
Advertisement