మహారాష్ట్రపైనే ఐటీ సంస్థల గురి | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రపైనే ఐటీ సంస్థల గురి

Published Thu, Dec 18 2014 10:54 PM

IT organizations focus on mumbai

సాక్షి, ముంబై: పుణే, నవీముంబై, ముంబై నగరాల్లో స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు మహారాష్ట్రనే ఎంపిక చేసుకుంటున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడే డేటా సెంటర్లు, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఆయా సంస్థలు పెడుతున్న పెట్టుబడులను బట్టి చూస్తే  దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయనే విషయం స్పష్టమవుతోంది. 

ఇదిలాఉండగా రాష్ట్రంలో సమాచార, సాంకేతిక శాఖ కోసం ‘టాస్క్ ఫోర్స్’ స్థాపించనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేయడమే ఈ టాస్క్‌ఫోర్స్ ముఖ్యోద్దేశం. ఆ ప్రకారం నాగపూర్, నాసిక్, ఔరంగాబాద్, కొల్హాపూర్ లాంటి నగరాలలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచార, సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement