బసవన్నల రంకెలు | Sakshi
Sakshi News home page

బసవన్నల రంకెలు

Published Fri, Feb 10 2017 2:21 AM

Jallikattu to be organised in Alanganallur in Tamil Nadu today

► పాలమేడులో  జల్లికట్టు సందడి
► నేడు అలంగా నల్లూరులో

సాక్షి, చెన్నై : రంకెలేసే బసవన్నలు, వాటి పొగరు అణచి వేసే క్రీడాకారుల పౌరుషంతో సాహస క్రీడ జల్లికట్టు గురువారం పాలమేడులో జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మదురై జిల్లా అలంగానల్లూరులో శుక్రవారం కోలాహలంగా జల్లికట్టు సాగనుంది. ఇందుకుతగ్గ ఏర్పాట్లు సర్వం సిద్ధం అయ్యాయి. తమిళుల సంప్రదాయ, సహాస క్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టును పోరాడి మరీ దక్కించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చట్టం, ఇందుకు రాష్ట్రపతి ఆమోదం వెరసి జల్లికట్టుపై విధించబడి ఉన్న అడ్డంకులన్నింటిని తొలగించాయి. మదురై జిల్లా అవనీయాపురం వేదికగా, రెండు రోజుల క్రితం జల్లికట్టుకు శ్రీకారం చుట్టారు. అవనీయాపురంలో ఏడు వందల ఎద్దులు రంకెలు వేస్తూ కదనరంగంలోకి దూసుకెళ్లాయి.

అవనీయాపురం తదుపరి పాలమేడులో గురువారం జరిగిన జల్లికట్టు వీరత్వాన్ని చాటింది. ఉదయం ఆరున్నగర గంటలకే పెద్ద ఎత్తున జన సందోహం వాడి వాసల్‌కు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కొమ్ములు తిరిగిన బసవన్నలు రంకెలేస్తూ రంగంలోకి దిగాయి. ముందుగా నమోదు చేసిన పశువులను మాత్రమే జల్లికట్టుకు అనుమతించారు. టోకెన్లు పొందిన క్రీడాకారులను మాత్రమే క్రీడా రంగంలోకి పంపించారు. ఎద్దులు జనం  లోకి చొచ్చుకు వెళ్లకుండా, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మదురై జిల్లా కలెక్టర్‌ వీరరాఘవులు జల్లికట్టును ప్రారంభించారు. పాలమేడు గ్రా మంలోని మహాలింగ స్వామి మఠం వద్ద ఏర్పా టు చేసిన వాడివాసల్‌కు ప్రత్యేక పూజలు జరి గాయి.

ఆలయంలో విశేష పూజల అనంతరం వాడి వాసల్‌ నుంచి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున రంగంలోకి ఎద్దులు దిగాయి. వాటి పొగరును అణచివేస్తూ క్రీడాకారులు తమ పౌరుషాన్ని చాటి బహుమతుల్ని తన్నుకెళ్లారు. గెలి చిన క్రీడాకారులకు సెల్‌ఫోన్ లు, బిందెలు,  బీరు వా, మంచాలు, వాషింగ్‌ మిషన్లు, ఏసీ, ఫ్యాన్లు, సైకిళ్లు, మోటార్‌ సైకిళ్లు, బుల్లెట్,  బంగారు నాణేలతో పాటు ఆకర్షణీయమైన బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. 850 ఎద్దులు పాల మేడుకు తరలివచ్చాయి. ఇందులో అనేక ఎద్దు తు క్రీడకారుల చేతికి చిక్కకుండా తమ యజ మానులకు బహుమతుల్ని సాధించి పెట్టాయి.

నేడు అలంగానల్లూరులో: జల్లికట్టు అంటే..అలంగా నల్లూరు అన్న విషయం తెలిసిందే. మదురైలో జల్లికట్టుకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామంలో శుక్రవారం సాహస క్రీడకు సర్వం సిద్ధం అయిం ది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరు జల్లికట్టు వీక్షణకు వేలాదిగా దేశ విదేశాల నుంచి జనం తరలి వచ్చే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఇక్కడ సాహస క్రీడ రసవత్తరంగా సాగబోతోంది. ఇక్కడ పదిహేను వందల ఎద్దులు వాడివాసల్‌ నుంచి దూసుకురాబోతున్నాయి.  

విచారణ : జల్లికట్టుకు మద్దతుగా సాగిన ఉద్యమ అల్లర్లపై రిటైర్డ్‌ న్యాయమూర్తి రాజేశ్వరన్‌ గురువారం విచారణ చేపట్టారు. బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

Advertisement
Advertisement