మంత్రులకు నేను చాలు

25 Jul, 2017 04:33 IST|Sakshi
మంత్రులకు నేను చాలు

తమిళసినిమా: రాష్ట్రాన్ని కాపాడడానికే మీ అవసరం కావాల్సి ఉంటుంది. మంత్రులకు బదులివ్వడానికి నేను చాలు అని నటుడు కమలహాసన్‌ తన అభిమానులకు సూచించారు. కమలహాసన్‌కు, రాష్ట్ర మంత్రులకు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు సంధించడమే వారి మధ్య వార్‌కు తెరలేచిందన్న విషయం తెలిసిందే.

అవినీతికి ఆధారాలుంటే బయట పెట్టాలన్న మంత్రుల సవాల్‌తో కమలహాసన్‌ శాఖల వారిగా అవినీతిపై ఆధారాలు సేకరించాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు.కాగా ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కమలహాసన్‌ అభిమానులు మంత్రులపై మాటల దాడి చేస్తూ పోస్టర్లను అతికించారు. ఈ చర్యలకు స్పందించిన నటుడు కమలహాసన్‌ పోస్టర్లు ముద్రిస్తూ డబ్బును వృథా చేయవద్దని, ఆ డబ్బును సహాయ కార్యక్రమాలను ఉపయోగిస్తే మంచిదని హితవు పలికారు. రాష్ట్రాన్ని కాపాడడానికే మీ అవసరం ఉంటుందని, ఇలాంటి మంత్రులకు బదులివ్వడానికి తాను చాలని కమల్‌ సోమవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు