విద్యుత్ సరఫరాలో అంతరాయం... కరవే ఆందోళన | Sakshi
Sakshi News home page

విద్యుత్ సరఫరాలో అంతరాయం... కరవే ఆందోళన

Published Thu, Aug 20 2015 1:45 AM

Karave concern the disruption in power supply ...

పోలీసుల లాఠీచార్జ్
 
రాయచూరు రూరల్: జిల్లాలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కరవే ఆధ్వర్యంలో జెస్కాం కార్యాలయాన్ని ముట్టడించారు. బుధవారం జెస్కాం కార్యాలయం వద్ద కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ సబ్ డివిజన్‌లోని ర్యాబిట్ వాహకం తరచూ మొరాయిస్తుండటంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కల్గిస్తోందన్నారు. దీని స్థానంలో మరో కొత్త ర్యాబిట్ వాహకాన్ని అమర్చేందుకు ఏబీబీ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. ప్రతి రోజు విద్యుత్ కోత వల్ల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. 

జిల్లాలోని గ్రామాల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతోందని, దీనికి ప్రజలు, రైతులు సమస్యలను అర్థం చేసుకోవాలన్నారు. జెస్కాం కార్యాలయాన్ని ముట్టడిస్తున్న సమయంలో పోలీసులు లాఠీచార్జి చేసి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగామాన్‌సింగ్ టాకూర్, మల్లికార్జున, కిశన్‌రావు, నాగయ్య స్వామి, నాగరాజు, మధు, సిరాజ్, బందే నవాజ్‌లున్నారు. అంతకు ముందు మహాబళేశ్వర వృత్తం నుండి జెస్కాం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
 
 
 

Advertisement
Advertisement