హిజ్రాల పెళ్లి సందడి | Sakshi
Sakshi News home page

హిజ్రాల పెళ్లి సందడి

Published Wed, Apr 20 2016 7:48 AM

హిజ్రాల పెళ్లి సందడి

తాళి కట్టుకుని ఆనందం
 సాక్షి, చెన్నై: కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి మంగళవారం ఆనందోత్సాహాలతో జరిగింది. కూత్తాండవర్ ఆలయ పూజర్ల చేతుల మీదుగా తాళి కట్టించుకుని హిజ్రాలు ఆనందంలో మునిగి తేలారు రాష్ర్టంలోని విల్లుపురం జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు హిజ్రాలకు ఓ వసంతోత్సవం.
 
 ఇక్కడి వేడుకకు మహాభారత యుద్ధగాధ ముడిపడి ఉన్నట్టు పురాణాలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. ఈ కార్యక్రమం నిమిత్తం దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు మంగళశారం తరలి వచ్చారు. ఎటు చూసినా, ఎక్కడ చూసినా హిజ్రాల సందడే. లాడ్జీలు, గెస్టు హౌస్‌లు, విడిదులు హౌస్‌ఫుల్. అందగత్తెలకు తామేమి తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని హిజ్రాలు ముందుకు సాగారు.
 
  హిజ్రాల పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్దఎత్తున దుకాణాలు వెలిశాయి. పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళి బొట్లను హిజ్రాలు కొనుగోలు చేశారు. ఆంధ్రా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటుగా విదేశాలకు చెందిన హిజ్రాలు సైతం ఈ ఏడాది పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. మంగళవారం సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్ల మాదిరి ముస్తాబైన హిజ్రాలు  కూత్తాండవర్ ఆలయం వద్దకు చేరుకున్నారు.
 
  భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా తాళి బొట్లు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు.  ఇతిహాసం మేరకు మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని తమ ఆరాధ్యుడిగా హిజ్రాలు కొలుస్తూ వస్తున్నారు. ఇక్కడ కొలువు దీరిన ఐరావంతుడి ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో వేడుకల్ని జరుపుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
 
 మిస్ కూవాగంగా గాయత్రి
 కేకేనగర్: విళ్లుపురంలో జరిగిన మిస్ కూ వాగం 2016కు నిర్వహించిన అందా ల పోటీల్లో సేలం గాయత్రి కిరీటాన్ని సొం తం చేసుకున్నారు. 2వ స్థానాన్ని మలేషియాకు చెందిన భవాని, 3వ స్థానాన్ని చెన్నై కుషి కైవసం చేసుకున్నారు. విల్లుపురం జిల్లా ఊళుందూర్‌పేట సమీపంలో గల కూవాగం కూత్తాండవర్ ఆలయంలో ప్రతి ఏడాది చిత్తిరై ఉత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
 
  హిజ్రాల తెలివితేటలను ప్రదర్శించే విధంగా విల్లుపురంలో అం దాల పోటీలు, నాట్య పోటీలు, వివిధ రకా ల పోటీలను నిర్వహిస్తారు. సోమవారం సా యంత్రం 36 జిల్లాలకు చెందిన హిజ్రా సంస్థల ప్రతినిధులు, ఎయిడ్స్ నియంత్ర ణ సంఘం సంయుక్తంగా నిర్వహించి న మిస్ కూవాగం 2016 అందాల పోటీలను విల్లుపురం లోని ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగింది.
 
 ఈ పోటీలకు చెన్నై, తూత్తుకుడి మలేషియా, బెంగళూరు, పుణే తదితర ప్రాంతాల నుంచి 55 మంది హిజ్రాలు పాల్గొన్నారు. మొదటి రౌండ్‌లో క్యాట్‌వాక్, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు జరిగా యి. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సినీ నటి షకీలా, నటుడు ఎం ఎస్ భాస్కర్, హిజ్రా నూరి హాజరై విజేతలను ఎంపిక చేశారు. మొదటి రౌండ్‌లో 20 మందిని ఎంపిక చేసి వారివద్ద కొన్ని ప్రశ్నలను వేసి సరైన సమాధానాలు చెప్పిన ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు.
 
  మిస్ కూవాగం 2016కు గాను సేలం గాయత్రికి మొదటిస్థానాన్ని రెండు, మూడు స్థానాలలో భవాని, కుషిల పేర్లను ప్రకటించారు. ఎంపికైన ముగ్గురికి మిస్ కూవాంగంగా సుందరి అనే బిరుదును, బహుమతులను న్యాయనిర్ణేతలు అందజేశారు. ఈ పోటీలను చూడడానికి అధిక సంఖ్యలో హిజ్రాలు, ప్రజలు హాజరయ్యారు.
 

Advertisement
Advertisement