సదా చిల్లర... | Sakshi
Sakshi News home page

సదా చిల్లర...

Published Fri, Nov 11 2016 2:19 AM

Lack of retailers

చిల్లర కొరతతో  ‘వెరుు్య’పాట్లు
రూ.  వంద కోసం గంటల పాటు పెట్రోలు బంకులో ఎదురుచూపులు
40 శాత ం తగ్గిన హోటళ్ల వ్యాపారం
టోల్‌గేట్ల వద్ద  కిలో   మీటర్ల మేర నిలిచిన   వాహనాలు
కలబుర్గిలో రూ.500  తీసుకుని రూ.400  ఇచ్చిన వైనం 
సొమ్మును బంగారంలోకి మార్చుకోవడానికి పరుగులు

బెంగళూరు:   పెద్దనోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజువారి పనులను వదులుకుని చిల్లర నోట్ల కోసం పెట్రోలు బంకులు, కమిషన్ ఏజెంట్లు, హోటల్స్ వద్ద క్యూలు కట్టారు. మరికొంతమంది అవసరం లేకపోరుునా బంగారు నాణేలు, ఆభరణాలను కొనడానికి ఎగబడ్డారు. మరోవైపు కిందిస్థారుు ప్రభుత్వ సిబ్బందికి సరైన సమాచారం లేకపోవడంతో బీఎంటీసీ ప్రయాణికులతో గొడవలకు దిగిన సంఘటనలు కూడా బెంగళూరు, మంగళూరుతో సహా పాటు కర్ణాటక వ్యాప్తంగా చోటు చేసుకున్నారుు. 

నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించినా తాత్కాలిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మంగళవారం రాత్రి తమ వద్ద ఉన్న నోట్లను డిపాజిట్ మిషన్ల ద్వారా   డిపాజిట్ చేయడానికి కొంతమంది ప్రయత్నించగా మరికొంతమంది రోజువారి ఖర్చుల కోసం డబ్బు తీసుకోవడానికి ఏటీఎంల వద్ద బారులు తీరారు.  మంగళూరు వద్ద చాలా మంది వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్ముతో బంగారు నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేయడం కోసం జ్యువెలరీ షాపుల వద్దకు పరిగెత్తారు. కొంతమంది సొమ్మును అడ్మాన్‌‌సగా ఇచ్చి బంగారాన్ని బుధ, గురు లేదా మరోవారం తర్వాతనైనా అందించాల్సిందిగా దుకాణం యజమానులకు చెప్పడం కనిపించింది.

ఇక బుధవారం ఉదయం నుంచే బెంగళూరుతో పాటు రాష్ట్రంలో పలు నగరాలకు, పట్టణాలకు కాయగూరలు, పూలు, పండ్లను రవాణా చేసే కే.ఆర్.మార్కెట్, రస్సెల్‌మార్కెట్, మల్లేశ్వరం, మడివాళ మార్కెట్‌లో  గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డారుు. అటు వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్మును మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నించగా వ్యాపారస్తులు తీసుకోలేదు. అంతేకాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి సరుకును తీసుకుని ఆయా మార్కెట్‌లకు చేరుకున్న రైతులు, దళారులు కూడా మార్కెట్‌లోని వ్యాపారస్తుల నుంచి సొమ్ములు తీసుకోవడానికి వెనుకడుగు వేయడం కనిపించింది. 

వందకోసం రెండు గంటలు...
చాలా మంది తమ వద్ద ఉన్న ఐదు వందలు, వెరుు్య నోట్లను మార్చుకోవడం కోసం పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టడంతో చిల్లర సమస్య ఏర్పడింది. నగరంలోని ఓ బంకు సిబ్బంది బెత్లహాం అనే వ్యక్తి వద్ద రూ.ఐదు వందలు తీసుకుని రూ.వందకు పెట్రోలు పోసి మిగిలిన రూ. నాలుగు వందల కోసం క్యూలో నిలబెట్టారు. వినియోగదారుల నుంచి నాలుగు వంద నోట్లు వచ్చిన తర్వాత సదరు నోట్లను తనకు ఇస్తామని చెప్పినట్లు బెత్లహాం సాక్షితో పేర్కొన్నారు. దాదాపు రెండు గంటలు ఇలా నిలబడ్డానని సదరు నోట్లు మరో రెండు రోజులు కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతాయని అందవల్ల విధిలేక ఇలా నిలబడాల్సి వచ్చిందని  వాపోయారు. ఇలాంటి ఇబ్బందులు చాలా చోట్ల కనిపించారుు.

కొన్ని హోటల్స్‌లలో రూ.500, రూ.1000లకు చిల్లరు లేదు అని బోర్డు పెట్టడంతో వినియోగదాలు వెనక్కు వెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ వ్యాపారం 30 నుంచి 40 శాతం తగ్గిపోరుుందని రాష్ట్ర హోటల్ యామజామాన్య సంఘం సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. 

కలబుర్గిలో కొంతమంది బృందంగా ఏర్పడి ఐదు వందలు తీసుకుని నాలుగు వందల రుపాయాలు ఇచ్చారు. వంద తక్కువైనా పర్వాలేదు రెండు రోజులు ఖర్చులకు సరిపోతాయన్న ఉద్దేశంతో చాలా మంది సదురు నోట్లను తీసుకోవడం కోసం ఎగబడ్డారు. 

రైల్వే, బస్‌స్టేషన్లలో నోట్ల వినిమయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అరుుతే  బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఈ నోట్ల వినిమయం ఎలా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో కండక్టర్ రూ.500 నోట్లను తీసుకోకపోవడంతో చాలా చోట్ల ప్రయాణికులకు, బస్సు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి విధిలేక చాలా మంది ప్రయాణికులు బస్సుల నుంచి మధ్యలోనే దిగిపోయారు. 

మంగళూరుకు చెందిన సత్యనారాయణ హీరేమఠ్ అనే వ్యక్తి  వారం రోజుల్లో తన కుమార్తె పెళ్లి కోసం రూ. రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారు. అన్నీ రూ.500, రూ.1000 నోట్లే. ఈ నోట్లు బుధవారం నుంచి చలామణిలో లేవు. పోనీ ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి నూతన నోట్లను తీసుకుందామంటే.. రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20వేలు మాత్రమే విత్‌డ్రాయల్ చేయడానికి అవకాశం ఉంది. అరుుతే పెళ్లికి అవసరమైన వస్తువులు కొనడానికి డబ్బు ఎలా సర్ధుబాటు చేయాలో తెలియడంల లేదని సత్యనారాయణ హీరేమఠ్ వాపోతున్నారు. 

అత్తిబెలే, నైస్‌రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, తుమకూరు రోడ్డు వద్ద టోల్‌గేట్ వద్ద వాహనదారులు ఇచ్చిన రూ.500, రూ.1,000 నోట్లను సిబ్బంది తీసుకోకపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయారుు. 

కొంతమంది తమ వద్ద ఉన్న ఐదు వందలకు చిల్లర కోసం యాచకుల వెంట పడ్డారు. ఈ ఘటనలు ఎక్కువగా బెంగళూరులోని ఎంజీరోడ్, కోరమంగళ వద్ద కనిపించారుు. సిగ్నల్స్ వద్ద యాచించే హిజ్రాల వద్ద కూడా రూ. ఐదు వందలు ఇచ్చి రూ. నాలుగు వందలు తీసుకోవడం కనిపించింది.  

మరోవైపు బీదర్‌లో కొంతమంది ఐదు వందల నోటును గాడిదకు తినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు. 

మొదట బ్యాంకులో  డిపాజిట్ చేయండి  
ప్రభుత్వ నిర్ణయం వల్ల నల్లధనానికి అడ్డుకట్టుపడుతుందనడంలో సందేహం లేదు. అరుుతే దీని వల్ల గరిష్టంగా రెండు నెలల పాటు అన్ని రంగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా అవగాహన చేసుకుని గరిష్టంగా రూ.రెండు కోట్ల నగదు (లిక్విడ్ అమౌంట్) ఉన్నవారికి ఒక సూచన. వంశపార్యంపర్యం కాని స్థిరాస్తుల అమ్మడం వల్ల వచ్చిన నగదు ఇంట్లో ఉంటే బ్యాంకులో డిపాజింట్ చేయడం మంచి నిర్ణయం. ఇందుకు డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉంది. అటు పై సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంట్ సలహాలు తీసుకుని అవసరమైన పన్నులు చెల్లిస్తే డిపాజిట్ చేసిన సొమ్ములో కొంత వరకూ అరుునా దక్కించుకోవడానికి సాధ్యమవుతుంది. - రాజేష్‌భట్, ఛార్టెడ్‌అకౌంట్

Advertisement

తప్పక చదవండి

Advertisement