ఆక్రోశం | Sakshi
Sakshi News home page

ఆక్రోశం

Published Tue, Jul 26 2016 2:34 AM

ఆక్రోశం

 సాక్షి ప్రతినిధి, చెన్నైః కొన్నాళ్లుగా శాంతియుతంగా సాగుతున్న లాయర్ల ఆందోళన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాదుల చట్టంలో చెన్నై హైకోర్టు కొన్ని సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులు తమిళనాడు గె జిట్‌లో కూడా ప్రచురితమయ్యాయి. చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించాలని కోరుతూ న్యాయవాదులు రెండు నెలలుగా పలురకాల ఆందోళనలు సాగిస్తున్నారు.
 
 ఈనెల 22వ తేదీన న్యాయవాద సంఘాలతో ఐదుగురితో కూడిన న్యాయమూర్తుల బృందం చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈనెల 29వ తేదీ నాటికి చర్చలను వాయిదావేశారు. ఇదిలా ఉండగా, కోర్టు కార్యక్రమాలను స్తంభింపజేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్న న్యాయవాదు ల జాబితాను పంపాల్సిందిగా అఖిల భారత బార్ కౌన్సిల్  చెన్నై హైకోర్టు బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది.  అలాగే జాబితాలో ఉన్న 126 మంది న్యాయవాదులను సస్పెండ్ చేస్తున్నట్లు అఖిల భారత బార్ కౌన్సిల్ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
 
 రెచ్చిపోయిన న్యాయవాదులు
 న్యాయవాదుల చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించక పోగా 126 మంది సస్పెండ్ కావడంతో న్యాయవాదులు సోమవారం మ రింతగా రెచ్చిపోయారు. సస్పెండ్ ఉత్తర్వులు అందిన నేపథ్యంలో చెన్నై హైకోర్టును ముట్టడించాలని ఆదివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఉద యం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో న్యాయవాదులు చేరుకోవడం ప్రారంభించారు. హైకోర్టుకు దారితీసే మార్గాల ను పోలీసులు ముందు జాగ్రత్తగా బారికేడ్లు అడ్డుపెట్టి మూసివేశారు. దీంతో అక్కడికి సమీపంలో ప్ర భుత్వ దంత వైద్యకళాశాల,
 రాజా అన్నామలై మన్రం వద్ద న్యాయవాదుల గుమికూడారు. న్యాయవాదులు జొరపడకుండా హైకోర్టు పరిసరాలను సుమారు 2 వేలమంది పోలీసులు మొహరించి బందోబస్తు నిర్వహించారు. హైకోర్టులోని ఏడు ప్రవేశద్వారాల వద్ద పోలీసులు నిలబడ్డారు. న్యాయవాదులు ఆందోళన కోసం సిద్ధం చేసుకున్న వేదికపైకి సస్పెండైన 126 మంది న్యాయవాదులు ఎక్కి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఉదయం 12 గంటల సమయానికి నాలుగువేల మందికి పైగా న్యాయవాదులు హైకోర్టువైపునకు ఊరేగింపుగా దూసుకువచ్చారు.
 
 బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంలో న్యాయవాదుల, పోలీసుల మధ్య తోపులాట సాగింది. ఈ సమయంలో కొంద రు న్యాయవాదులు పోలీసులపైకి వాటర్ బాటిళ్లు విసిరేయగా,  ఒక న్యాయవాది ఆత్మాహుతి యత్నం చే య డంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలో పాల్గొన్న లాయర్లు ‘న్యాయమూర్తులు’ అనే అక్షరాలు కలిగిన ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి తగులబెట్టారు. ప్రధాన న్యాయమూర్తి ఇంటిని కూడా ముట్టడించే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే సుమారు 20 మంది సాయుధ పోలీసులను న్యాయమూర్తుల క్వార్టర్‌లోని ప్రధాన న్యాయమూర్తి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 స్తంభించిన ఉత్తర చెన్నై
 న్యాయవాదుల ఆందోళన కారణంగా పెద్దఎత్తున పోలీసులు మొహరింపు, బారికేడ్లు పెట్టడం, కొడిమర రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలతో ఉత్తర చెన్నై దాదాపుగా స్తంభించి పోయింది. ఉద్రిక్త పరిస్థితులను ముందుగానే ఊహించిన ఆయా ప్రాం తాల వ్యాపారులు ముందుగానే దుకాణాలను మూసివేశారు. కొన్ని రోడ్ల వద్ద అప్పటికప్పుడు ట్రాఫిక్ మళ్లించడం వల్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
 
 హైకోర్టుకే బెదిరింపులాః ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కే కౌల్
 న్యాయవాద పట్టా పుచ్చుకున్న వారు హైకోర్టుకే బెదిరింపులకు పాల్పడడం శోచనీయమని ప్రధాన న్యాయమూర్తి సంజ య్ కిషన్ కౌల్ అన్నారు. న్యాయవాదులు తమ అసంతృప్తిని మరో కోణంలో చాటుకోవడంలో తమకు అభ్యంతరం లేదని, అయితే హైకోర్టు ప్రాంగణంలోనే శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు సిద్ధం కావడంతో పోలీసు బందోబస్తు తప్పలేదని అన్నారు. న్యాయవాదులు చర్చలకు ముందుకు రావాలని కోరారు.           
 

Advertisement

తప్పక చదవండి

Advertisement