ప్రేమించలేదని పెట్రోల్‌ పోసి నిప్పు | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని పెట్రోల్‌ పోసి నిప్పు

Published Sat, Mar 25 2017 9:26 PM

Loved the fire by pouring petrol

► ఆపై కత్తిపోట్లు
► యువతి పరిస్థితి విషమం
► కర్ణాటకలో ఘోరం
యశ్వంతపుర:  ప్రేమను నిరాకరించిందని ఒక యువకుడు ఉన్మాదంతో యువతిపై పెట్రోలు పోసి నిప్పటించాడు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పల జిల్లాలోని కుష్టగి తాలుకా మదనూరు గ్రామంలో జరిగింది. గంగావతి తాలుకా మర్లానహళ్ళి గ్రామానికి చెందిన అమరగౌడ అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. యలబుర్గ గ్రామంలో నివాసం ఉంటున్న యువతి తాలుకాలోని ముదనూర ప్రభుతత్వాస్పత్రిలో సహాయకురాలుగా పని చేస్తోంది.  
 
కుష్టగిలో ఒక కార్యక్రమానికి తల్లితో కలిసి బయల్దేరింది. ముదనూరు బస్టాండు వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన అమరగౌడ తన బైకుపై డ్రాప్‌ చేస్తానని నమ్మించి ఇద్దరినీ ఎక్కించుకు వెళ్లాడు. కొంచెం దూరం వెళ్ళాక తను తీసుకొచ్చిన పెట్రోల్‌ సీసా తీసి యువతిపైన పోసి నిప్పు అంటించాడు. మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన యువతి తల్లికి కూడా గాయాలయ్యాయి. ఆ దారిలో వెళ్లే కొందరు తల్లీకూతురిని కుష్టగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్‌ మంటల్లో తీవ్రంగా కాలడంతో యువతి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. కుష్టగి పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలె యువతికి పెళ్ళి నిశ్చయమైంది. అమరగౌడ వివాహితుడైనా బాధితురాలి వెంటపడి ప్రేమపేరుతో వేధిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement