రుణ మాఫీపై సర్కార్ మాయ | Sakshi
Sakshi News home page

రుణ మాఫీపై సర్కార్ మాయ

Published Tue, Jul 29 2014 2:33 AM

Maya Sarkar debt waiver

  • ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
  • బెళుగుప్ప : తెలుగుదేశం ప్రభుత్వం రుణ మాఫీపై రైతులను మాయ చేస్తోందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన బెళుగుప్పలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస కల్యాణమంటపంలో సర్పంచ్ రామేశ్వరరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ దుద్దేకుంట రామాంజనేయులు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

    జిల్లాలో రైతులకు రూ.5000 కోట్ల రుణాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ మాఫీ అవుతాయన్న ఆశతో వారు ఎదురు చూస్తున్నారన్నారు. అయితే ప్రస్తుత ం ప్రభుత్వం చెబుతున్న నిబంధనల మేరకు రూ. 1200 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయని అన్నారు. అనంతపురాన్ని రెండవ రాజధాని ఏర్పాటు చేసే విషయం, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, కొత్త రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ పక్కనపెట్టి రాజధాని నిర్మాణం కోసం అంటూ విరాళాల రూపంలో రూ.కోట్లు తీసుకెళ్లారని సీఎం చంద్రబాబునాయుడును విమర్శించారు.

    జిల్లాకు గత ఏడాదికి వచ్చిన రూ.678 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీలో కేంద్రం వాటా 57 శాతం ఇప్పటికే ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను రైతుల ఖాతాలకు జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఖరీప్ సమయం పూర్తవుతున్నా రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ సమస్యలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

    ప్రజలకు మద్దతుగా ఉండి ఎన్నికల హామీలు అమలు చేసేవరకు పోరాడుమని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ లాల్యానాయక్, పార్టీ జిల్లా అధికార ప్రతినిది వీరన్న, సర్పంచ్‌లు అనిత, గోవిందప్ప, ఎర్రిస్వామి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశులు, సాలాబాయి, పార్టీ మండల మహిళా కన్వీనర్ యశోదమ్మ, సీనియర్ నాయకులు జక్కన్నగారి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్రిస్వామి, మాజీ సర్పంచ్ నక్కలపల్లి భాస్కర్‌రెడ్డి, పురుషోత్తం రాజు, లక్ష్మన్న, చౌదరి, నరిగన్న తదితరులు పాల్గొన్నారు.   
     

Advertisement
Advertisement