ఆస్పత్రిలో అమ్మాయిలు, నర్సుల నిర్వాకం | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో అమ్మాయిలు, నర్సుల నిర్వాకం

Published Wed, May 11 2016 11:00 AM

ఆస్పత్రిలో అమ్మాయిలు, నర్సుల నిర్వాకం

ముంబై: ముంబై మహానగరంలో ఆస్పత్రులు రద్దీగా ఉంటాయి. ముంబైతో పాటు సుదూర ప్రాంతాల నుంచి నిత్యం చికిత్స కోసం ప్రజలు వస్తుంటారు. రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఆస్పత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడటం వైద్య సిబ్బంది బాధ్యత. అలాంటిది ముంబైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో మ్యూజిక్, డాన్స్లతో హోరెత్తించారు. సిబ్బంది ఆస్పత్రిని ఏకంగా ఫంక్షన్ హాల్లా మార్చేశారు.

ఆస్పత్రిలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి మైనర్ అమ్మాయిలతో డాన్స్లు చేయించారు. పెద్దగా సౌండ్ వచ్చేలా పాటలు పెట్టి మరీ డాన్స్ చేయించారు. చిన్నపిల్లలతో పాటు నర్సులు, మహిళలు డాన్స్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అసౌకర్యం కలుగుతుందన్న స్పృహకూడా లేకుండా సంబరాలు చేసుకున్నారు. వైద్య సిబ్బంది నిర్వాకం చూసి రోగులు అవాక్కయ్యారు. డాన్స్ చేస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా తతంగం ఏ ఆస్పత్రిలో ఎప్పుడు జరిగిందన్న వివరాలు తెలియరాలేదు.

Advertisement
Advertisement